మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు నెరవేర్చాలి – రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు డిమాండ్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాలు చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలని, కొత్త మోనుకు బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్ బిల్లులు తక్షణ విడుదల, జనబోయిన పథక నిర్వహణ అక్షయపాత్రకు అప్పగింపడానికి విరమించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2023 సెప్టెంబర్ 28 నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరావధిక సమ్మె చేస్తామని సిఐటియు పక్షాన ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము అని అన్నారు.
2022 మార్చి 15 ముఖ్యమంత్రి అసెంబ్లీలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రస్తుతం పొందుతున్న వేతనంపై అదనంగా 2000 రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించారు.
మన యూనియన్ చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా జీవో నెంబర్ 8ని విడుదల చేసింది కానీ కార్మికుల పెరిగిన జీతం ఇంతవరకు ఇవ్వలేదు పెండింగ్ బిల్లులు కూడా విడుదల కావడం లేదు.
కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో పెరిగిన వేతనాలకు బడ్జెట్ కేటాయించాలని, చెల్లించాలని, పెండింగ్ బిల్లులు , గుడ్లకు వదనంగా బడ్జెట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జీవో నెంబర్ 8 ప్రకారం వేతనాలు వేరియర్స్ తో సహా చెల్లించాలన్నారు.పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలనీ, కొత్త మెనూ సవరించాలి,అక్రమ తొలగింపులు అరికట్టాలన్నారు.
రాజకీయ వేధింపుల ఆపాలి.ప్రమాద బీమా, పిఎఫ్, ఈ ఎస్ ఐ , సౌకర్యం కల్పించాలి.
ఎలాంటి శరత్ లేకుండా బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వాలి.తదితర డిమాండ్లు నెరవేర్చాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కార్యదర్శి కోడం రమణ, అధ్యక్షులు, ఎగమాటి ఎల్లారెడ్డి, మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి, గురజాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
పని మొదలు పెట్టిన జియోస్టార్.. రూ. 15ల నుంచే ఎంటర్టైన్మెంట్ షురూ