కెజీబీవీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

రైస్ మిల్లు ను తొలగించాలంటూ ప్రజావాణిలో వినతిపత్రం అందజేత.రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) తంగళ్ళపల్లి కేజీబీవీ విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణి యందు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్( Maraveni Ranjith Kumar ) మాట్లాడుతూ తంగళ్ళపల్లి కేజీబీవీ పాఠశాల ప్రక్కన గల వీరాంజనేయ రైస్ మిల్ నుండి వచ్చె దుమ్ము దుళి పోగతో విద్యార్థులకు శ్వాసకోశ కంటి చూపు సమస్యలతో అనారోగ్యానికి గురవుతున్నారు కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని కలెక్టర్ ని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ( ABVP ) రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్,జిల్లా కన్వీనర్ అక్కమ్ నాగరాజు పాల్గొన్నారు.

ఎయిరిండియా ఫ్లైట్ 182పై బాంబు దాడికి 39 ఏళ్లు : దర్యాప్తు జరుగుతోందన్న కెనడా పోలీసులు