అంగన్ వాడి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

తహాసిల్దార్ బోయిని రామచందర్ కు వినతి పత్రం అందజేత లేదంటే ఈ నెల 11 నుండి నిరవధిక సమ్మె చేస్తాం - మండల అంగన్ వాడి ఉద్యోగులు రాజన్న సిరిసిల్ల జిల్లా : అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట మండల అంగన్ వాడి ఉద్యోగులు(Anganwadi Employees ) మండల తహసిల్దార్ బోయిని రాంచందర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.

ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మండల అంగన్ వాడి ఉద్యోగులు మంగళవారం ప్రెస్ నోటు విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల మంది అంగన్ వాడి ఉద్యోగులుగా పనిచేస్తున్నారని వీరంతా మహిళ ఉద్యోగులుగా ఉండి బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఉన్నారని పేర్కొన్నారు.

గత 45 సంవత్సరాలుగా ఐసిడిఎస్ లో పనిచేస్తూ పేద ప్రజలకు సేవలను అందిస్తున్నామని లేకలో ఆవేదన వ్యక్తం చేశారు.

వీరికి కనీస వేతనం, పెన్షన్, ఈ ఎస్ ఐ, ఉద్యోగ భద్రత, చట్టబద్రత వంటి కనీస సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం లేదని దీనివల్ల తమ ఉద్యోగులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాలలో తమ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పెన్షన్, హెల్త్ కార్డులు, రిటైర్మెంట్ పెన్షన్, బోనస్ తదితర వంటివి అమలు చేశారని అదేవిధంగా తెలంగాణ అంగన్ వాడి ఉద్యోగుల( Telangana ) సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనియెడల ఈనెల 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

హీరోయిన్ గా ఒక వెలుగు వెలగల్సిన ఈ నటి ఎందుకు ఇలా ఉండిపోయింది