ప్రదాన రహదారి మధ్యలో ఉన్న గుంతలు పూడ్చి మరమ్మత్తు చేపట్టాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల( Boinpalli ) కేంద్రం నుండి కొదురుపాకకు వెళ్లే రహదారిలో శివారులో ఉన్న పెట్రోల్ బంకు ముందు రోడ్డు రహదారి మధ్యలో గుంతలు ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డు భవనాల శాఖ అధికారులు దృష్టి పెట్టకపోవడం వల్ల రెండు రోజుల క్రితం గుంతల వల్ల ద్విచక్ర వాహనము మీది నుండి కిందపడి ఒక మహిళ నిండు ప్రాణం పోవడం జరిగింది.

కొదురుపాక( Kodurupaka ) నుండి గంగాధరకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో,ఈ రహదారి నుండి ప్రతిరోజు వందల వాహనాలు వెళ్తుంటాయి.

సాయంత్రం అయిందంటే ఈ పెట్రోల్ బంకు ముందు ఉన్న గుంతలు ఏర్పడక వాహనాదారులకు ఎప్పుడు ఏమతుందోనని, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ప్రయాణించవలసిన దుస్థితి ఏర్పదుతుందని,ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారన్నారు.

ఇప్పటికైనా ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి, మరమ్మత్తులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా నివారించవలసిన బాధ్యత అధికారులు చేపట్టాలని బోయినిపల్లి మండల సిపిఎం పార్టీ శాఖ,మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ తరపున అధికారులను డిమాండ్ చేయడం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో బోయినిపల్లి గ్రామస్తులు ఎడపెల్లి ప్రసాద్,ఎడపెల్లి రాజేశం,చంద్రగిరి అరవిందు, తదితరులు పాల్గొన్నారు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?