సీఎం పదవి కొత్త కాదు..: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

సీఎం జగన్ కు నాలుగేళ్ల తర్వాత బీసీలు గుర్తుకొచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

గుంటూరు జిల్లా నారాకోడూరులో పర్యటించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ నిర్వహిస్తున్న సభలకు రాకుంటే పథకాలు కట్ చేస్తామని ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

టీడీపీ సభలకు జనం స్వచ్ఛందంగా తరలివస్తున్నారని చెప్పారు.అమరావతి ఉద్యమానికి నారాకోడూరు నుంచి కూరగాయాలు పంపారన్నారు.

ముఖ్యమంత్రి పదవి తనకు కొత్త కాదన్న చంద్రబాబు ఏపీని కాపాడుకోవడానికి వచ్చినట్లు వెల్లడించారు.

ఈ క్రమంలో సైకో పాలన వద్దు.సైకిల్ పాలనే ముద్దు అంటూ వ్యాఖ్యనించారు.

నాన్న చేసిన అతి పెద్ద తప్పు అదే.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు!