ఈటల చేసేవే హత్యా రాజకీయాలు..: ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
TeluguStop.com
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో ఈటల ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.అసలు ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నారన్న ఏ పార్టీ నుంచి ఈటల పోటీ చేస్తారని ప్రశ్నించారు.
హుజూరాబాద్ ప్రజలు ఈటలకు సరైన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.ముదిరాజ్ లంటే ఈటలకు గౌరవం లేదన్న కౌశిక్ రెడ్డి బీసీలపై ప్రేమ ఉంటే అల్లుడు, కోడలు ముదిరాజ్ ల్లో దొరకలేదా అని ప్రశ్నించారు.
ఈటల చేసేవే హత్యా రాజకీయాలని ఆరోపించారు.రాజకీయంగా తనను అడ్డు తొలగించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
రక్తదానం ప్రయోజనాలేంటి.. ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు?