త్రిక్రమ్‌ చెప్పినట్లుగా ఎన్టీఆర్‌ ఎన్నికల ప్రచారం.. గెలుపు ఖాయమేనా?

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘అరవింద సమేత’ చిత్రంలో నటిస్తున్నాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం దసరా కానుకగా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.

ఎన్టీఆర్‌ అభిమానుల్లో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.అంచనాలకు తగ్గట్లుగా త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని తన మార్క్‌తో తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా షూటింగ్‌ ముగిసింది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ‘అరవింద సమేత’ చిత్రంలో రెండు సీన్స్‌ గురించి అభిమానులు మరియు సినీ వర్గాల వారు ఎక్కువగా చర్చించుకుంటున్నారు.

ఒకటి ఇటీవ లీక్‌ అయిన యాక్షన్‌ సన్నివేశం.ఆ యాక్షన్‌ సన్నివేశంలో ఎన్టీఆర్‌ చాలా ఎమోషనల్‌గా కనిపిస్తున్నాడు.

అయిదు నిమిషాల పాటు వచ్చే ఆ యాక్షన్‌ సీన్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాల వారి ద్వారా సమాచారం అందుతుంది.

ఇక మరో సీన్‌ ఎన్నికలు జరిగే సీన్‌ అంటూ సమాచారం అందుతుంది.ఈ చిత్రంలో ఒక సీన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి.

ఆ సీన్‌లో ఎన్టీఆర్‌ తనవారి కోసం ప్రచారం చేస్తాడు.ఆ సీన్‌ కూడా దాదాపుగా అయిదు నిమిషాలు ఉంటుందని, ఆ సీన్‌ సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంటుందని సమాచారం అందుతుంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా త్రివిక్రమ్‌ రాసిన డైలాగ్స్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తాయని, త్రివిక్రమ్‌ ఎన్నికల డైలాగ్స్‌ ఎన్టీఆర్‌ చెబుతుంటే ప్రేక్షకులు మైమరిచి పోవడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటుంది.

ఇలాంటి సమయంలో అరవింద సమేతలో ఎన్నికల సీన్‌ ఉండటంతో అందరి దృష్టి కూడా ఆ సీన్‌పై ఉంది.

ఆ సీన్‌ సినిమా హైలైట్‌గా ఉంటుంది అంటూ నందమూరి ఫ్యాన్స్‌ అంటున్నారు.ఎన్టీఆర్‌కు ఈ చిత్రం ఒక అద్బుతమైన విజయాన్ని సొంతం చేయడంతో పాటు, రికార్డుల వర్షం కూడా కురిపిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఆ బ్యూటీ అవసరమా.. ఇలా చేశావేంటి జక్కన్న?