జిల్లాల్లో ఖరీదైన బైకులు లక్ష్యంగా దొంగతనాలు…ఛేదించిన పోలీసులు
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఖరీదైన బైకులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కోదాడ పట్టణ,మునగాల పోలీసులు చేధించారు.
దొంగతనానికి గురైన 27 బైకులను స్వాధీనం చేసుకున్నారు.కోదాడ పట్టణ కేసుకు సంబంధించి ఐదుగురు దొంగలను అరెస్టు చేసి వారి నుండి 21 కేసులలో రూ.
22 లక్షల విలువగల 21 బైకులు సీజ్ చేశారు.అలాగే మునగాల పోలీస్ స్టేషన్ కేసుకు సంబంధించి ముగ్గురు దొంగలను అరెస్టు చేసి వారి నుండి 6 కేసుల్లో రూ.
3.1 లక్షల విలువగల 6 బైకులు సీజ్ చేశారు.
మొత్తం 28కేసుల్లో రూ.25 లక్షల విలువగల 27 బైకులు సీజ్ చేసినట్లు జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసుల్లో మొత్తం 8 మంది దొంగల అరెస్టు చేసి,వారి నుండి రాయల్ ఎన్ఫీల్డ్స్ బైకులు -6, యునికార్న్ బైకులు - 7,పల్సర్ బైకులు - 10,హెచ్ డి డీలక్స్ - 2, గ్లామర్ బైక్ -1,శైన్ బైక్- 1 స్వాధీనం చేసుకొని,దొంగల ముఠాను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి,సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్,కోదాడ పట్టణ సీఐ రాము,మునగాల సీఐ రామకృష్ణారెడ్డి,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు, ఎస్ఐలు శ్రీకాంత్,ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
మౌనం వీడిన కవిత : అదానికో న్యాయం.. ఆడ బిడ్డకో న్యాయమా ?