జిల్లా కలెక్టరేట్ ముట్టడికి వచ్చిన విఆర్ఏ లను అడ్డుకున్న పోలీసులు...
TeluguStop.com
మేడ్చల్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర విఆర్ఏ జెఏసి చైర్మన్ రాజన్న పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద కలెక్టరేట్ కార్యాలయం ముట్టడించిన మేడ్చల్ జిల్లా విఆర్ఏ లు.
జిల్లా కలెక్టరేట్ ముట్టడికి వచ్చిన విఆర్ఏ లను అడ్డుకున్న పోలీసులు.ఎట్టకేలకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన విఆర్ఎలు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న 195 మంది విఆర్ఎలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.విఆర్ఏ ల ధర్నాకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా విఆర్ఏ అధ్యక్షురాలు లక్ష్మీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా మా విఆర్ఎలకు వెంటనే పే స్కెల్ ఇవ్వాలి అని అన్నారు.
విఆర్ఎలకు రావాల్సిన ప్రమోషన్స్ కూడా వెంటనే ఇవ్వవలని అన్నారు.
గూస్ బాంబ్స్ పక్కా.. దేశం కోసం సైన్యం ఎలా కష్టపుడుతుందో చూసారా ఎప్పుడైనా?