రైతుకు అండగా నిలిచిన పోలీసులు.. రోడ్డుపై పడిన ధాన్యాన్ని చేతులతో ఎత్తారు
TeluguStop.com
పోలీసులు అనగానే కొంత మందికి మంచి అభిప్రాయం ఉంటుంది.మరికొంత మందికి చెడు అభిప్రాయం ఉంటుంది.
అయితే మనకు ఎవరి వల్ల అయినా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నిస్సహాయ పరిస్థితుల్లో మనకు పోలీసులే( Police ) అండగా నిలుస్తారు.
అర్ధరాత్రి అయినా ప్రజలకు కష్టం వచ్చిందంటే ఫోన్ చేయగానే వచ్చేస్తారు.పోలీసులు చేసే సేవ, సామాజిక కార్యక్రమాలు ఎంతో మందికి స్పూర్తిని ఇస్తుంటాయి.
తాజాగా కొందరు పోలీసులు మానవతా దృక్పథంతో చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది.ఆ పోలీసులను అందరూ మెచ్చుకుంటున్నారు.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. """/" /
ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్( Meerut )లో ఇటీవల ఆసక్తికర ఘటన జరిగింది.
ఓ వృద్ధుడైన రైతు( Former ) తన ధాన్యాన్ని తీసుకుని, వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు.
ఇంతలో ధాన్యం బస్తాలకు కన్నం పడి, ధాన్యం అంతా రోడ్డుపై పడిపోయింది.అదే సమయంలో రోడ్డుపై వాహనాలు ఎక్కువగా వస్తున్నాయి.
రోడ్డుపై పడిన ధాన్యం వల్ల ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవుతుంది. """/" /
మరో వైపు రోడ్డుపై పడిపోయిన ధాన్యం కోసం ఆ రైతు దీనంగా ఎదురు చూస్తున్నాడు.
అదే సమయంలో ఆ రైతు ఇబ్బందులను అక్కడే ఉన్న పోలీసులు గమనించారు.విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్ రామ్‌ఫాల్ వెంటనే సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నాడు.
ఆ వృద్ధుడికి సహాయం చేసి, ధాన్యాన్ని తిరిగి ఆ పోలీసులు సంచిలో నింపారు.
రోడ్డుపై పడిన ధాన్యాన్ని పోలీసులు చేతితో ఎత్తుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనిని చూసిన నెటిజన్లు పోలీసులను ప్రశంసిస్తున్నారు.పోలీసులు అంతా ఇదే రీతిలో ప్రజలతో సన్నిహితంగా ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాల్లో మ్యాటర్ తగ్గుతుందా..? ఇప్పుడు వచ్చే సినిమాల పరిస్థితి ఏంటి..?