శిరీషా మృతి కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచిన పోలీసులు
TeluguStop.com
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో చోటు చేసుకున్న శిరీషా మృతి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
శిరీషా కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో శిరీషా మృతిచెందిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు.
మృతురాలు కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ సెల్ ఫోన్ విషయంలో తన బావకు, శిరీషాకు మధ్య గొడవ అయిందని తెలిపారు.
యువతి శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా విచారణ చేస్తున్నామన్న ఆయన బయటి వ్యక్తులు హత్య చేసి ఉంటారనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.ఈ నేపథ్యంలోనే శిరీషాది హత్యా లేక ఆత్మహత్య అనేది పూర్తి విచారణ తరువాత వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి22, బుధవారం 2025