దెందులూరులో బాలికపై అత్యాచారం చేసిన వాలంటీర్ నీ అరెస్ట్ చేసిన పోలీసులు..!!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు వ్యవస్థ( Voulnteer System ) పెట్టడం జరిగింది.
ఈ వ్యవస్థ.వైసీపీ ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
జగన్ ప్రభుత్వం( Jagan Government ) అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడంతో పాటు.
ప్రతి నెల పెన్షన్ ఇంకా వివిధ రకాల సమస్యలను.ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వారదులుగా పనిచేస్తున్నారు.
అయితే ఈ వ్యవస్థ పట్ల ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి.మహిళలను అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) ఆరోపణలు కూడా చేయడం జరిగింది.
"""/"/
ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు( TDP Leaders ) సైతం విమర్శలు చేస్తూ ఉన్నారు.
ఇదిలా ఉంటే దెందులూరు మండలంలో పదవ తరగతి చదువుతున్న బాలికపై వాలంటీర్ అత్యాచారానికి పాల్పడటం జరిగింది.
దీంతో సదరు వాలంటీర్ నీ స్థానిక పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేయడం జరిగింది.
ఈ మేరకు నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మండలానికి చెందిన నీలపు శివకుమార్.బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు వెళ్లడం జరిగింది.
ఇదే సమయంలో నిందితుడిని అరెస్టు చేసే రిమాండ్ కి తరలించినట్లు స్పష్టం చేశారు.
పెళ్లికి ముందే శోభితకు నాగచైతన్య అలాంటి కండిషన్ పెట్టాడా… వామ్మో?