జపాన్: భార్యకు రోజూ ఫోన్ చేస్తున్న భర్త.. అంతే అరెస్ట్ చేసిన పోలీసులు..?
TeluguStop.com
పార్ట్‌నర్స్ ఒకరినొకరు పట్టించుకోకపోతే సంబంధం దెబ్బతింటుంది.కానీ ఎక్కువగా పట్టించుకోవడం కూడా ఇబ్బందులకు దారితీస్తుంది.
ప్రేమగా చూపించడంలో ఒక లిమిట్ అనేది ఉండాలి.ఆ లిమిట్ దాటితే కొత్త సమస్యలు వచ్చి పడతాయి.
జపాన్‌లో( Japan ) ఒకాయన భార్యను అతిగా ప్రేమించి ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు.
ఆయన రోజుకు 100 సార్లు తన భార్యకు ఫోన్ చేసేవారు.భార్య రిసీవ్ చేయకపోతే, అన్‌నోన్ నంబర్ల నుంచి కూడా ఆమెకు ఫోన్ చేసేవారు.
భర్త రోజుకు కొన్నిసార్లు ఫోన్ చేయడం సహజమే అయినా, ఆయన నిరంతరం ఫోన్ చేయడం ఆమెకు బాధ కలిగించింది.
ఆయన ప్రవర్తన ఆమెకు చాలా ఇబ్బంది కలిగించింది కాబట్టి, ఆయనపై తీవ్ర చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది.
జపాన్‌లోని అమగసకి అనే నగరంలో నివసించే 38 ఏళ్ల ఈ వ్యక్తి తన భార్యకు రోజుకు దాదాపు 100 సార్లు ఫోన్ చేసేవాడు.
భార్య ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసేవాడు. """/" /
ఈ విషయం ఆమెకు తెలియక, ఆమె చాలా ఆందోళన చెందేది.
వారాల తరబడి ఇలా జరిగిన తర్వాత ఆమె చాలా కోపం తెచ్చుకుంది.ఆమె ఇంట్లో ఉన్నప్పుడు లేదా ఆమె భర్త వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రమే ఫోన్ కాల్స్ ఆగడం ఆమె గమనించింది.
దీంతో ఆమెకు తన భర్తపై అనుమానం వచ్చింది.ఆ 31 ఏళ్ల మహిళ తనకు వస్తున్న వింత ఫోన్ కాల్స్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన భర్తే ఈ కాల్స్ చేస్తున్నాడని తనకు అనుమానం అని కూడా చెప్పింది.
పోలీసులు ఈ విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.దర్యాప్తు చేసిన తర్వాత ఆమె భర్తే ఆ కాల్స్ చేస్తున్నాడని నిర్ధారించారు.
"""/" /
సెప్టెంబర్ 4న, జపాన్‌లోని యాంటీ స్టాకింగ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆయనను అరెస్టు చేశారు.
అన్‌నోన్ నంబర్ల నుంచి ఎందుకు అంత ఎక్కువ కాల్స్ చేశారని అడిగినప్పుడు, తన భార్యను ప్రేమిస్తున్నందున అలా చేశానని ఆయన చెప్పాడు.
ఆయన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది.అమగసకిలో భర్త తన భార్యను స్టాకింగ్ చేసిన కేసు ఇదే మొదటి కేసు అని అధికారులు తెలిపారు.
SSMB 29 నో వాటర్ బాటిల్… కొత్త రూల్ అమలు చేయబోతున్న జక్కన్న!