బొమ్మ తుపాకీతో బెదిరించి వృద్ధ దంపతులను దోచుకునేందుకు ప్లాన్.. కానీ చివరకు..?
TeluguStop.com
బొమ్మ తుపాకి( Toy Gun )తో వృద్ధ దంపతుల ఇంట్లోకి ప్రవేశించి మొత్తం దోచేయాలి అనుకున్నా దొంగల ప్రయత్నాన్ని పూర్తిగా విఫలం అయ్యేలా చేశారు ఆ వృద్ధ దంపతులు.
ఈ ఘటన తణుకు మండలం వేల్పూరులో చోటుచేసుకుంది.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.
వివరాల్లోకెళితే.వేల్పూరు( Velpuru )లోని బాలాజీ నగర్ లో బండా బాబురావు అనే వృద్ధుడు తన భార్యతో కలిసి జీవిస్తున్నారు.
ఈనెల 8వ తేదీ సాయంత్రం సుమారుగా 6 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు బాబురావు ఇంటి తలుపు తట్టారు.
బాబురావు తలుపు తీయగా ఆ ముగ్గురు వ్యక్తులు బొమ్మ తుపాకీ మరియు కత్తులతో బెదిరించి ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు.
బాబురావు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా చేతికి గాయం అయింది.అయినా కూడా బాబురావు వారిని ఇంట్లోకి ప్రవేశించకుండా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.
బాబురావు భార్య గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వస్తారనే భయంతో ఆ దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.
"""/" /
ఆ తర్వాత బాబురావు దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఆ వృద్ధ దంపతులు ఏర్పాటు చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్( CCTV Footage) ఆధారంగా నిందితులను చాకచక్యంగా పోలీసులు అరెస్టు చేశారు( Arrested )దొంగలను ఎలా పట్టుబడ్డారంటే.
తణుకు మండలం దువ్వలో ఉండే ఫర్నిచర్ షాప్ యజమాని యూపీ కి చెందిన వర్కర్లను తీసుకువచ్చి షాప్ లో ఫర్నిచర్ చేయించి అమ్మకాలు చేసేవాడు.
ఈ షాపులో పనిచేసే ఒక వ్యక్తి ఇటీవలే బాబురావు ఇంట్లో ఫర్నిచర్ వర్క్ చేశాడు.
ఆ సమయంలో ఇంట్లో కేవలం ఇద్దరూ వృద్ధులు మాత్రమే ఉన్నారు చాలా సులభంగా దొంగతనం చేయొచ్చు అని భావించాడు.
"""/" /
దొంగతనానికి తాను వెళితే కచ్చితంగా గుర్తుపడతాడని భావించి అదే షాపులో పనిచేస్తున్న తన ముగ్గురు స్నేహితులతో కలిసి దొంగతనం చేసేందుకు స్కెచ్ వేశాడు.
కానీ దొంగతనానికి వెళ్లి చేసిన ప్రయత్నం విఫలం అయింది.ఆ వృద్ధ దంపతులు ఇంటి ముందు సీసీటీవీ కెమెరాలతో పాటు ఇంటికి రక్షణగా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం వల్ల దొంగలు దొంగతనం చేయలేకపోయారు.
యూపీ కి చెందిన మహమ్మద్ సాదిక్, మహమ్మద్ హర్షద్, ఉస్మాన్, షాహి అలం లను నిందితులుగా గుర్తించారు.
వీరితో పాటు వెళ్లిన ఓ మైనర్ దొంగ పరారీలో ఉన్నాడు.ఈ నిందితుల వద్ద బొమ్మ తుపాకీ, రెండు చాకులు, ఒక తాడు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.
ఇండస్ట్రీ లో ఎవరు టాప్ పొజిషన్ కి చేరుకోబోతున్నారు…