గురుత్వాకర్షణ పనిచెయ్యని ప్రదేశం మనదేశంలోనే వుంది… ఎక్కడంటే?
TeluguStop.com
అదేంటి, గురుత్వాకర్షణ ( Gravity )పనిచెయ్యని ప్రదేశమా? అలాంటిది కూడా వుంటుందా? అనే అనుమానం కలుగుతోంది కదా.
అవును, మనదగ్గరే కలదు.సకల సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం మన భారతదేశం.
ఇక్కడ ఉన్నన్ని మతాలూ, ఆచారాలు ప్రపంచంలోని మరేదేశంలో కూడా ఉండవనే విషయం ఈ ప్రపంచానికి తెలుసు.
అందుకే ఈ నేలపై పుట్టిన వారు ఎంతో అదృష్టవంతులు అని ప్రతీతి. """/" /
అసలు విషయంలోకి వెళితే.
గుజరాత్ రాష్ట్రం, గిర్ సోమనాథ్ జిల్లా, తులసీ శ్యామ్ అనే ప్రదేశంలో గురుత్వాకర్షణ పనిచెయ్యదు.
ఇక్కడ గురుత్వాకర్షణ లేని ఓ కొండ ఉంది.అక్కడ భూమ్యాకర్షణ శక్తి పనిచెయ్యదు.
సాధారణంగా కొండ ప్రాంతంలో ఓ వాహనాన్ని వదిలితే అది సరాసరి కిందకు పోతుంది.
కానీ ఇక్కడ వదిలిన వాహనాలు కొండపైకి వెళ్తాయి.ఇది కళ్లారా చూసినా కూడా నమ్మబుద్ధి కాదు.
ఇక్కడున్న తులసీ శ్యామ్ ఆలయానికి ఉత్తరంగా 400 మీటర్ల దూరంలో ఉంది ఈ కొండ.
"""/" /
ఇక ఇక్కడున్న తులసీ శ్యామ( Tulasi Shyama Temple ) (మహావిష్ణు) ఆలయం 3000 ఏళ్ల నాటిదని చెబుతూ వుంటారు.
పురాణాల ప్రకారం.తుల్ అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు( Krishna ) అక్కడే వధించడం వలన ఆ ఆలయాన్ని తులసీశ్యామ్ అని పిలుస్తున్నారు.
ఆలయంలో స్వామి నల్లరాతి విగ్రహం ఉంటుంది.ఆలయానికి దగ్గర్లో సల్ఫర్ వేడి నీటి బుగ్గ ఉంది.
ఆ నీటికి అద్భుత శక్తి ఉందని స్థానికులు నమ్ముతారు.ఇక ఈ ప్రదేశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.
వారు కూడా ఈ విషయాన్ని చాలా నమ్మకంగా చెబుతున్నారు.కాబట్టి మీరు ఓసారి అటువైపు వెళ్ళినపుడు తప్పకుండా ఆలయాన్ని మరియు ఆ కొండని దర్శించండి.