చుండ్రును శాశ్వతంగా వదిలించే పుదీనా ఆయిల్..ఎలా వాడాలంటే?
TeluguStop.com

చుండ్రు.దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు.


అయితే కొందరిని చుండ్రు వదలనే వదలదు.రకరకాల హెయిర్ ప్యాక్స్ వేసుకున్నా, షాంపూలను మార్చిన చుండ్రు పోదు.


దాంతో ఏం చేయాలో తెలియక చివరకు ట్రీట్‌మెంట్ వరకు వెళ్తారు.కానీ, సరైన పద్ధతులు పాటిస్తే సులభంగా ఇంట్లోనే చుండ్రు సమస్యను నివారించుకోవచ్చు.
ముఖ్యంగా అందుకు పుదీనా ఆయిల్ అద్భుతంగా సమాయపడుతుంది.చండ్రును నివారించడమే కాదు మరిన్ని బెనిఫిట్స్‌ను కూడా ఈ ఆయిల్ అందించగలదు.
మరి పుదీనా ఆయిల్ ను హెయిర్‌కి ఎలా యూజ్ చేయాలో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అర స్పూన్ పుదీనా ఆయిల్, మూడు స్పూన్ల కొబ్బరి నూనె మరియు అర స్పూన్ ఆముదం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఆయిల్‌ను రాత్రి నిద్రించే ముందు తలకు అప్లై చేసుకుని కాసేపు మసాజ్ చేసుకోవాలి.
ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు పరార్ అవ్వడమే కాదు.
మళ్లీ మళ్లీ రాకుండా కూడా ఉంటుంది. """/" /
అలాగే హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది ఉన్న వారు సైతం ఈ పుదీనా ఆయిల్‌ను యూజ్ చేయవచ్చు.
అర స్పూన్ పుదీనా నూనెలో, మూడు స్పూన్ల కొబ్బరి నూనెను మిక్స్ చేసి తలకు పట్టించి.
ఓ గంట తర్వాత కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూ యూజ్ చేసి హెడ్ బాత్ చేసేయాలి.
ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అయ్యి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
"""/" /
ఇక చిట్లిన హెయిర్‌ను రిపేర్ చేయడంలోనూ పుదీనా ఆయిల్ సహాయపడుతుంది.
చిట్లిన జుట్టుకు డైరెక్టర్‌గా పుదీనా ఆయిల్‌ను అప్లై చేసుకుని ముప్పై, నలబై నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో కడిగేయండి.
ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇదేందయ్యా ఇది.. కొబ్బరి బొండం టీ అంటా.. మీరేమైనా తాగారా? వైరల్ వీడియో