నడిరోడ్డుపై చేపల లారీ బోల్తా.. ఎగబడ్డ ప్రజలు.. చివరకు?

ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ప్రమాదవశాత్తు వాహనాలు ప్రమాదాలకు గురవుతున్న సంగతి తెలిసిందే.

ఇలా కొన్నిసార్లు ప్రజలకు ఉపయోగపడే వస్తువులు సంబంధించి వాహనాలు కూడా నడిరోడ్లలో బోల్తా పడిన సంఘటనలు కూడా అనేకం.

ఇలాంటి ఘటనలలో అప్పుడప్పుడు పాల ట్యాంకర్, పెట్రోల్ ట్యాంకర్, మద్యం బాటిల్ల లారీలు ఇలా అనేక వాహనాలు బోల్తా పడిన సంఘటనలలో చుట్టుపక్కల ఉన్న ప్రజలు అక్కడ పడి ఉన్న వాటిని తీసుకువెళ్లడం మనం సోషల్ మీడియాలో చాలాసార్లు చూశాము.

అచ్చం అలాంటి సంఘటన తాజాగా మరొకటి జరిగింది. """/" / అయితే ఈసారి చేపల లోడుతో( Loads Of Fish ) వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో నడిరోడ్డుపై పడి ఉన్న చేపలు ఊరి ప్రజలు తీసుకువెళ్లిపోయిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.ఖమ్మం నుంచి వరంగల్ ( Khammam To Warangal )వైపు చేపలలోడుతో వెళ్తున్న లారీ మహబూబాబాద్ జిల్లా మరిపెడలో అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

లారీలో ఉన్న చేపలు మొత్తం నడిరోడ్డుపై చెల్లాచెదరులుగా పడ్డ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చాలామంది సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ అక్కడి సన్నివేశాన్ని తెలుపుతున్నారు.

"""/" / చేపల లారీ నడిరోడ్డుపై బోల్తాపడటంతో బయటపడిన చేపల కోసం అక్కడి ప్రజలు ఒకరిపై ఒకరు ఎగబడ్డారు.

నిమిషాల వ్యవధిలో అందిన వరకు ప్రజలు చేపలన్నింటిని తీసుకెళ్లిపోయారు.ఇక లారీ బోల్తా పడిన విషయం పోలీసులకు తెలియడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపు చేశారు.

లారీ బోల్తా పడడంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.అయితే ఈ ఘటన ఎలా జరిగిందన్న వివరాలు మాత్రం ఇంకా తెలియ రాలేదు.

రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న లారీని తొలగించి అక్కడ ఉన్న ట్రాఫిక్ ను క్లియర్ చేశారు ట్రాఫిక్ పోలీసులు .

ఈ ముగ్గురు దర్శకుల సినిమాలు అందుకే ప్రత్యేకంగా నిలుస్తున్నాయా..?