విమానంలో ఇచ్చిన ఫుడ్ చూసి ప్రయాణికుడు షాక్.. మనిషి దంతం లభ్యం
TeluguStop.com
సాధారణంగా ట్రైన్ ప్యాసింజర్లు ఆహారంలో బొద్దింకలు, క్వాలిటీ తక్కువ ఆహారాలు, ఇంకా తదితర ఆహార సంబంధిత ఇబ్బంది పడుతుంటారు.
విమానంలో ఆహారం చాలావరకు బాగానే ఉంటుంది.దీని గురించి ఫిర్యాదు ఇచ్చే వారు కూడా తక్కువగానే ఉంటారు.
కాగా తాజాగా ఓ విమాన ప్రయాణికురాలు తాను ఆర్డర్ చేసిన ఫుడ్ లో ఒక దంతం పొందింది.
ఆ విషయాన్ని తాను @ghadaelhoss అనే పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది.
బ్రిటీష్ ఎయిర్ వేస్‌లో ఓ మనిషి పన్ను లేదా దంతం రావడం తనను షాక్‌కి గురి చేసిందని ఆమె చెప్పుకొచ్చింది.
"అక్టోబర్ 25న లండన్ నుంచి దుబాయ్‌కి వెళ్లే BA107 విమానంలో మాకు సిబ్బంది ఒక ఫుడ్ సర్వ్ చేసింది.
అందులో ఒక దంతం లభించింది.అది చూడగానే చాలా భయమేసింది.
దీనిపై సిబ్బంది ఎవరు కూడా స్పందించలేదు" అనే క్యాప్షన్‌తో తనకు ఇచ్చిన ఆహారంలో పన్ను లేదా దంతం ఉన్న ఫొటోని ఆమె షేర్ చేసింది.
ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారి తీసింది.నెటిజన్లు బ్రిటీష్ ఎయిర్ లైన్స్ ఏకిపారేస్తున్నారు.
"""/"/
ఈ ఇష్యూపై బ్రిటీష్ ఎయిర్‌వేస్ ఎట్టకేలకు ఒక రిప్లై ఇచ్చింది."హలో, మీకు ఇలాంటి అనుభవం ఎదురయిందని తెలుసుకోవడం ద్వారా మేం చాలా చింతిస్తున్నాం.
మా కస్టమర్ రిలేషన్స్ టీమ్‌కి, మా క్యాబిన్ సిబ్బందికి మీ వివరాలను అందించారా? భద్రత కోసం, దయచేసి మాకు మీ పర్సనల్ డీటెయిల్స్ డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపండి.
" అని ఒక రిప్లై ఇచ్చింది.అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్రిటిష్ ఎయిర్ వేస్‌ను నెటిజన్లు ఇప్పటికీ తిట్టిపోస్తున్నారు.
వీడియో: 24 గంటల్లోనే 101 మందితో శృంగారం.. ఆ అనుభవం గురించి ఆమె చెప్పిందేంటంటే..?