కుక్కకు తాడుకట్టి బైక్‌తో పాటు పరిగెత్తిస్తున్న యజమాని... తర్వాత ఏం జరిగిందో తెలిస్తే!

కుక్క తమ యజమానులను చాలా నిస్వార్థంగా ప్రేమిస్తుంది.అందుకే శునకం ప్రేమించినంతగా మనుషులు కూడా ప్రేమించలేరని అంటారు.

కుక్క తన యజమాని కోసం ఎంత సాహసమైనా చేస్తుంది.అలాంటి కుక్కలను కొందరు యజ మానులు చాలా బాధ పెడుతున్నారు.

తాజాగా అలాంటి యజమానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో కనికరంలేని ఓ కుక్క యజమానికి ఓ వ్యక్తి బుద్ధి చెప్పాడు.

ఈ దృశ్యాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.వివేక్ జాడో అనే యూజర్ ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

వైరల్ అవుతున్న వీడియోలో బైక్‌పై కూర్చున్న ఇద్దరు వ్యక్తులు తమతో పాటు ఓ కుక్కను తీసుకెళ్లడం చూడొచ్చు.

ఈ యజ మానులు తమ బైక్‌పై స్థలం లేకపోవడంతో కుక్కను తాడుతో కట్టేసి రోడ్డుపై పరుగులు తీయించడం మొదలుపెట్టారు.

పాపం నోరులేని ఆ జీవి ఎర్రటి ఎండలో చెవులకు చిల్లులు పెట్టే బైక్ శబ్దాన్ని వింటూ నిస్సహాయ స్థితిలో పరిగెత్తుతోంది.

ఇంతలోనే స్కూటర్ పై వెళ్తున్న మరో వ్యక్తి కుక్క యజ మానులను ఆపాడు.

కుక్కని ఎందుకు అలా పరిగెత్తిస్తున్నారని అడిగాడు.రోడ్లపై ఉరకలేక కుక్క నరక యాతన పడుతుందని, అయినా కూడా కనికరం లేకుండా ఎలా దాన్ని పరిగెత్తిస్తున్నారని గట్టిగా అడిగాడు.

కావాలంటే నేను లిఫ్ట్ ఇస్తానని కూడా చెప్పి తన గొప్ప మనసును చాటుకున్నాడు.

అలాగే ఆ కుక్కకు తన స్కూటర్‌పై కూర్చోబెట్టుకుని లిఫ్ట్ ఇచ్చాడు.అయితే ఈ దృశ్యాలన్నీ వివేక్ జాడో అనే ఒక వ్యక్తి తన కారులో నుంచి వీడియో తీశాడు.

అనంతరం దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడది వైరల్ గా మారింది.

దీన్ని చూసిన జంతు ప్రేమికులు స్కూటీ రైడర్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు.అలాగే బైక్ పై హాయిగా కూర్చొని కుక్కను హింసించిన యజమానులపై ఫైర్ అవుతున్నారు.

నేటికీ మానవత్వం బతికే ఉందని స్కూటీ రైడర్ ను తెగ పొగుడు తున్నారు.

ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.