ఈ షాపు ఓనర్ మనసు బంగారం.. రక్కూన్‌కి ఫ్రీగా డోనట్ ఎలా ఇచ్చాడో చూడండి..
TeluguStop.com
ప్రపంచంలో రెండు రకాల ప్రజలు ఉంటారు.వారిలో జంతువులను హింసించేవారు ఒక రకమైతే, మరో రకం వారు మూగ జంతువులకు ఆహారం అందించి తమ మానవత్వాన్ని చాటుకుంటుంటారు.
ఇలాంటి వారికి చెందిన వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి.ఈ కోవకు చెందిన మరో వీడియో తాజాగా వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో డంకిన్ డోనట్స్ కాఫీ షాప్ యొక్క ఓనర్ రక్కూన్‌కి ఫ్రీగా డోనట్ ఇవ్వడం కనిపించింది.
వివరాల్లోకి వెళ్తే.డంకిన్ డోనట్స్( Dunkin Donuts ) అనే కాఫీ షాప్ ఎదుట కార్ల నుంచి బయటకు రాకుండా ఆహారాన్ని అందించే ఒక డ్రైవ్-త్రూ ఉంది.
అయితే ఒకరోజు, ఫ్లోరిడా( Florida )కు చెందిన సమంతా గుప్తిల్ అనే మహిళ ఒక రక్కూన్ డ్రైవ్-త్రూ విండోకు వెళ్లడం చూసి ఆశ్చర్యపోయింది.
ఆపై తన ఫోన్ కెమెరా ఓపెన్ చేసి ఈ దృశ్యాలను రికార్డ్ చేయడం ప్రారంభించింది.
తర్వాత దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. """/" /
ఆ వీడియోలో, రక్కూన్( Raccoon ) రోడ్డు దాటుతున్నట్లు, నేరుగా కిటికీ వద్దకు వెళ్లి ఏదైనా తినడానికి ఇవ్వమని దీనంగా చూస్తున్నట్లు చూడవచ్చు.
కారులో ఉన్న సమంత, ఆమె స్నేహితురాలు ఇది చూసి ఆశ్చర్య పోవడంతో పాటు నవ్వేశారు.
వారు రక్కూన్‌కు హాని కలిగించకుండా జాగ్రత్తపడ్డారు.తరువాత ఏమి జరుగుతుందో చూడాలని ఓపిక పట్టారు.
"""/" /
కిటికీ వద్ద ఉన్న డంకిన్ డోనట్స్ ఓనర్ రక్కూన్‌కి ఒక డోనట్ ఇచ్చాడు.
రక్కూన్ దానిని తన పాదాలతో తీసుకొని, ఆపై నోటిలో కరుచుకొని దానిని సంతోషంగా తినడానికి తీసుకు వెళ్ళింది.
సమంత ఈ దృశ్యం చూసి ఎంతో ముచ్చట పడింది.టిక్‌టాక్, ఫేస్‌బుక్‌లో వీడియోను షేర్ చేసింది.
చాలా మంది దీన్ని లైక్ చేసారు.మరికొందరు ఆ షాపు ఓనర్ మనసును పొగిడారు.
ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
విమానం ఇంజన్‌లోకి దూసుకెళ్లిన పక్షి.. చివరికి ఏమైందో చూడండి..