ఒరిజినల్ కి బ్రో మూవీకి అసలు సంబందమే లేదు గా… అంత గురూజీ మాయ…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం బ్రో( Bro ).

సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ( People's Media Factory ) నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పట్ల ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

ఒకవైపు పొలిటికల్ ఈవెంట్లలో పాల్గొంటూ ఇంకొక వైపు సినిమాలకు సంబంధించిన షూటింగ్లలో పాల్గొంటూ పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

జూలై 29వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై పవన్ అభిమానులు భారీ స్థాయిలో అంచనాలను పెట్టుకున్నారు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ నిన్న విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.

అయితే రెండు రోజుల క్రితమే చిత్ర బృందం ప్రకటించింది.దాంతో మెగా అభిమానులు మరియు పవన్ అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా దీనికోసం ఎదురు చూశారు.

కాగా ఈ టీజర్ విడుదల కాస్త ఆలస్యంగా జరిగిందని చెప్పాలి.ముందుగా ఐదు గంటల ఐదు నిమిషాలకే దీనిని విడుదల చేస్తామని వెల్లడించిన చిత్ర బృందం చిన్న టెక్నికల్ ఇబ్బంది కలగడంతో కొద్దిసేపు లేట్ గా విడుదల చేసింది.

మరి ఈ టీజర్ విషయానికి వస్తే సాయిధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ టీజర్ లో అదరగొట్టారని చెప్పాలి.

"""/" / ఇక పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల విషయానికొస్తే ఆయన ప్రస్తుతం నాలుగైదు సినిమాలను సెట్స్ మీద ఉంచారని చెప్పాలి.

అందులో మొదటగా బ్రో సినిమా విడుదల కాబోతుంది.ఆ తర్వాత సుజిత్( Sujith ) దర్శకత్వంలో చేస్తున్న ఓజి సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు.

ఇక హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా ఆ తర్వాత విడుదల కానున్నాయి.

"""/" / బ్రో మూవీ టీజర్ లో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది టైం లో కనిపించినట్లు గా అంత యంగ్ గా కనిపిస్తున్నాడు అంటూ పవన్ అభిమానులు చాలా సంతోష పడుతున్నారు.

ఇది ఒరిజినల్ సినిమా కంటే కూడా పెద్ద విజయం సాధిస్తుంది అని ఈ టీజర్ చూస్తే మనకు అర్థం అవుతుంది ఇక త్రివిక్రమ్( Trivikram ) ఇందులో చాలా చేంజెస్ చేసినట్లు గా తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో ఎన్నికలలోపు వీలైనన్ని సినిమాలు చేయాలనుకున్న పవన్ కళ్యాణ్ వాటి ద్వారా ఏమాత్రం సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

ఆ విషయంలో మహేష్ నమ్రతలతో పోల్చి చూస్తే సితార టాప్.. అసలేం జరిగిందంటే?