పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు భయపడుతున్నాయి..: సజ్జల
TeluguStop.com
సీఎం జగన్ ( CM Jagan )పై దాడి జరిగిన ఘటనను డ్రామా అనడం సరికాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
జగన్ కు డ్రామాలు ఆడటం, నటించడం చేతకాదని తెలిపారు. """/" /
ఎవరైనా తమపై తామే దాడి చేయించుకుంటారా అని సజ్జల( Sajjala Ramakrishna Reddy ) ప్రశ్నించారు.
ఎన్నికల్లో తమకు పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని చెప్పారు.చంద్రబాబు దాడిని ఖండిస్తూనే మరో పక్క డ్రామా అంటున్నారని మండిపడ్డారు.
దాడిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు.పవన్ మాటలు ఇబ్బందికరంగా ఉన్నాయన్న సజ్జల రాయితో దూరం నుంచి ఎవరైనా కావాలని కొట్టించుకుంటారా అని ప్రశ్నించారు.
జగన్ పై ఎవరు దాడి చేశారో? ఎందుకు చేశారో తేలాలని తెలిపారు.
విద్యార్థినికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన ఉపాధ్యాయుడిని చితకబాదిన తల్లిదండ్రులు