హైదరాబాద్ జూ పార్కులో ఉన్న ఏకైక చిరుత మృతి

హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్ లో ఉన్న ఏకైక చిరుత మృత్యువాత పడింది.

15 ఏళ్ల సంవత్సరాల వయసున్న చిరుత గుండెపోటుతో మృతి చెందినట్లు జూ అధికారులు తెలిపారు.

కాగా ఈ చిరుతను హైదరాబాద్ పర్యటన కు వచ్చిన సమయంలో సౌదీ అరేబియా యువరాజు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో 2013 వ సంవత్సరంలో సౌదీ నుంచి హైదరాబాద్ కు చిరుతను తీసుకువచ్చారు.

అయితే సాధారణంగా అడవిలో జీవించే చిరుత పులులా జీవితకాలం 12 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

మరీ ఇంత దారుణమా.. స్కూటర్‌తో ఢీకొట్టి.. మనిషిని అక్కడే వదిలేసి వెళ్లిపోయిన మహిళ!