తెలంగాణలో కొనసాగుతున్న పోలింగ్ పలుచోట్ల ఆలస్యంగా..

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల( Assembly Elections ) పోలింగ్ మొదలైంది.ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందనే అంచనాలు మొదలయ్యాయి .

ఇదిలా ఉంటే కొన్నిచోట్ల గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది.పలుచోట్ల ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు.

ఇప్పటికే పలువురు ప్రముఖులు, సినీ తారలు ఓటేసి వెళ్లారు .కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయిస్తూ ఇబ్బందులు పెడుతున్నాయి.

దీంతో కొన్నిచోట్ల ఆలస్యంగా పోలింగ్ ప్రక్రియ మొదలైంది.ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేసే ప్రక్రియలో నిమగ్నం అయ్యారు.

ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,  భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.

"""/" / సూర్యాపేట( Suryapet ) బూత్ నెంబర్ 89, బాసర 252వ బూత్ మెదక్ జిల్లా ఎల్లాపూర్ కరీంనగర్ లో 371 నెంబర్ బూత్ లో ఈవీఎం లు మరణించడంతో అక్కడ పోలింగ్ ప్రక్రియ ఆలస్యం గా మొదలైంది.

ధర్మపురి లో పోలింగ్ స్టేషన్ 39 నెంబర్ ధర్మపురిలో ఈవీఎం మోరయించింది .

దీంతో ఇక్కడ 20 నిముషాలు ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది పెద్దపల్లి జిల్లా( Peddapalli ) రామగుండం నియోజకవర్గంలో 87వ నెంబర్ పోలింగ్ బూత్ లో ఈవీఎం మిషన్ పని చేయకపోవడంతో దానిని సరి చేసే పనులు అధికారులు నిమగ్నం అయ్యారు.

  మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో రెండు పోలింగ్ కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది.

తాళ్లపేట పోలింగ్ బూత్ వద్ద మాకుల పేట్ 5 వ నంబర్ పోలింగ్ బూత్ వద్ద ఈవీఎం లు మరణించాయి.

అలాగే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హైదర్ షాకోట్ ప్రభుత్వ పాఠశాలలో బూత్ నెంబర్ 89 లో ఈవీఎం లో ఇబ్బందులు ఏర్పడ్డాయి.

"""/" / మహబూబాబాద్ జిల్లా బయ్యారం హైస్కూల్ లో 33 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది.

అలాగే వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బూత్ నంబర్ 169 లో ఈవీఎం లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి.

ఈ విధంగా చాలా చోట్ల ఏవీఎంలలో సాంకేతిక లోపం తలెత్తడంతో అక్కడ పోలింగ్ ప్రక్రియ  కాస్త ఆలస్యం గా మొదలయ్యింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్6, ఆదివారం 2024