తిరుమలలో కొనసాగుతున్న ‘ఆపరేషన్ చిరుత’..!!

తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది.టీటీడీ మరియు అటవీశాఖ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా వంద మంది సిబ్బంది ఆపరేషన్ చిరుతలో పాల్గొనగా మరో వందమంది సిబ్బంది వీరికి సహకరిస్తున్నారని తెలుస్తోంది.

చిరుతలను బంధించేందుకు శేషాచలం అడవుల్లో అధికారులు ఇప్పటికే మూడు బోన్లను ఏర్పాటు చేశారు.

అదేవిధంగా మరో ఆరు బోన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.తిరుమల నడక మార్గంలో ఇంకా నాలుగైదు చిరుతలు సంచరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.కాగా ఇటీవల చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతిచెందడంతో అప్రమత్తమైన అధికారులు భక్తుల భద్రత కోసం చర్యలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఇప్పటికే మూడు చిరుతలను బంధించారు.

ట్రంప్‌కు ఫస్ట్ షాక్ .. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను నిలిపివేసిన కోర్ట్, భారతీయులకు ఊరట