వైరల్: వేలంలోకి అతి పురాతన కళ్లద్దాలు..!

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సామెత మనం ఎప్పటినుంచో వింటూనే ఉన్నాం కదా.

? ఎందుకంటే ఏ విషయంలోనైనా ఓల్డ్ కున్న వాల్యూ అంతా ఇంతా కాదు.

అందులో ప్రస్తుతం తయారు చేసిన వస్తువుల కన్నా పాత వస్తువులైన, పురాతన వస్తువులకైనా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

అయితే సోషల్ మీడియా వచ్చాక ఎక్కడ ఏం జరిగినా, ఎలాంటి పురాతన వస్తువులు బయటపడినా క్షణాల్లో తెలిసిపోతుంటాయి.

అలాగే ఇప్పుడు ఒక పురాతన వస్తువు గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేంటి అంటే.లండన్ లోని సొతేబి వేలం సంస్థ నిర్వహించిన ఆక్షన్ లో పురాతన కాలం నాటి వినూత్న అద్దాలు వెలుగులోకి వచ్చాయి.

అయితే ఇవి రాజుల కాలంలో వాడేవారని 17వ శతాబ్దంనాటి మొగలుల కళ్ళద్దాలు అయ్యి ఉంటాయని నిర్వాహకులు వేలంలో ఉంచారు.

అయితే ఈ అందాలు చూడటానికి చాలా అందంగా 200 క్యారెట్లు వజ్రాలతో 300 క్యారెట్ల ఏమరాల్డ్స్ తో తయారు చేయబడ్డాయి.

దీంతో ఈ కళ్ళ అద్దాలను కొనేందుకు ఔత్సాహికులు పోటీ పడ్డారు. """/"/ అయితే ఈ అద్దాలు తొలిసారి వేలానికి ముందు ప్రజల సందర్శనార్థం ఈ నెల 7 నుంచి 11 వరకు హాంగ్ కాంగ్ లో ప్రదర్శనకు ఉంచారు.

తాజాగా లండన్ లో ప్రదర్శనలో పెట్టారు.ఈ ప్రదర్శన అక్టోబర్ 26 వరకు జరగనుంది.

అదే రోజే వేలంలో ఉంచుతారని నిర్వాహకులు తెలిపారు.ఈ కళ్ళద్దాలు ఒక్కోటి సుమారు రూ.

15 కోట్ల నుంచి రూ.25 కోట్ల దాకా ఉందని అంచనా వేస్తున్నారు.

కాగా ఈ కళ్ళద్దాలు దాదాపు యాభై ఏళ్ల పాటు ఓ వ్యక్తి వద్ద ఉన్నట్లు తెలిపింది.

ఇదేందయ్యా ఇది.. దిగవ నుంచి ఎగవకు ప్రవహిస్తున్న నీరు.. ఎక్కడో తెలుసా..?!