ఎంత దారుణం.. క‌డియాల కోసం వృద్ధురాలి కాళ్లు న‌రికి..

ఈ మ‌ధ్య జ‌రుగుతున్న దారుణాలు చూస్తుంట‌నే వ‌ణికి పోతున్నాం.దోపీకి పాల్ప‌డే వారు చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు.

ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని జ‌రిగిన ఓ దారుణం అయితే ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టిస్తోంది.

ఈ రాష్ట్రంలోని ఎక్లారా గ్రామంలో జ‌రిగిన ఘటన త‌ల‌చుకుంటేనే అత్యంత భ‌యాన‌కంగా ఉంటుంది.

ఈ గ్రామంలో రతన్‌బాయి అనే వృద్ధురాలు పంట పొలంలో ప‌ని నిమిత్తం వెళ్తుండ‌గా కొంద‌రు దుండగులు అనుకోకుండా ఆమెకు ఎదుర‌య్యారు.

ఇక వారు ఆమె ద‌గ్గ‌రున్న విలువైన వ‌స్తువుల కోసం ఏకంగా ఆమె కాళ్ల‌ను న‌రికేశారు.

రతన్‌ బాయి ఎప్ప‌టిలాగే త‌న పొలంలో కలుపు తీసే తీసే ప‌ని కోసం వెళ్లేందుకు రెడీ అయింది.

ఇలా త‌న ఇంటి నుంచి కొద్ది దూరం వెళ్లగానే ఆమెను గ‌మ‌నిస్తున్న కొంద‌రు దుండగులు ప్లాన్ ప్ర‌కారం ఆమె మీద దారుణంగా అటాక్ చేశారు.

ఆమె కాళ్ల‌కు వేసుకున్న కడియాలు, ఇతర బంగారు ఆభ‌ర‌ణాల కోసం త‌మ‌ద‌గ్గ‌ర ఉన్న ప‌దునైన ఆయుధాల‌తో ఏకంగా కాళ్లు న‌రికేశారు.

అప్ప‌టికీ కూడా ఆమె వారితో చాల‌సేపు పోరాడింది.ఈ క్ర‌మంలోనే ఆ గొడ‌వ‌లో ఆ వృద్ధురాలి తలకు తీవ్ర గాయాలు కావ‌డంతో స్పృహ త‌ప్పి ప‌డిపోయింది.

"""/"/ ఆమె త‌ల‌కు, కాళ్లకు తీవ్రంగా ర‌క్త‌స్రావం జ‌ర‌గ‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందడం పెద్ద సంచ‌ల‌నం అయింది.

ఈ దారుణ‌మైన ఘటన అందరినీ క‌లిచివేసింది.ఇక వృద్ధురాలి హ‌త్య‌కు సంబంధించిన ఘ‌ట‌న తెలిసి పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు.

వృద్ధురాలు ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలోనే ఈ దాడి జ‌రిగి ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక ఘ‌ట‌న స్థ‌లంలో ఎలాంటి క్లూ దొరకక‌పోవ‌డంతో ఎవ‌రు చేశారో అనే విష‌యంపై పోలీసులు కూలంకుశంగా సోదిస్తున్నారు.

నిదితుల‌ను త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని పోలీసులు వెల్ల‌డిస్తున్నారు.

యూఎస్ మిలిటరీ ఫ్లైట్‌లో భారతీయుడికి నరకం.. కాళ్లు, చేతులు బంధించి ఘోర అవమానం..