జైలులో చంద్రబాబు నాయుడు కి టార్చర్ చూపిస్తున్న అధికారులు..నిద్రపోనివ్వకుండా అలాంటి పనులు చేస్తున్నారా?
TeluguStop.com
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అకస్మాత్తుగా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అరెస్ట్ తో ఎలా మారిపోయాయి మన అందరం చూస్తూనే ఉన్నాము.
అక్రమంగా అరెస్ట్ చేసారని చంద్ర బాబు నాయుడు పై ప్రతిపక్ష పార్టీలన్నీ సంఘీభావం వ్యక్తం చేసాయి.
ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే నేరుగా రాజముండ్రి సెంట్రల్ జైలు( Rajahmundry Central Jail ) కి వెళ్లి చంద్రబాబు నాయుడు ని కలిసాడు.
ఆయన్ని కలిసి బయటికి వచ్చిన తర్వాత వచ్చే ఎన్నికలలో టీడీపీ మరియు జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయంటూ అధికారికంగా ప్రకటించారు.
దీంతో అధికార వైసీపీ పార్టీ కి గుండెల్లో గుబులు మొదలైంది.చంద్ర బాబు నాయుడు జైలు లో ఉండడం వల్ల రోజు రోజుకి ఆయన మీద సానుభూతి జనాల్లో పెరిగిపోతూ ఉంది.
80 ఏళ్ళ వయస్సు ఉన్న పెద్దాయనని ఇలా బాధపెట్టడం కరెక్ట్ కాదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.
"""/" /
ఇకపోతే చంద్రబాబు నాయుడుకి బైలు కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మరియు చంద్రబాబు కలుస్తున్నారని.ఇద్దరిలో ఒకరు జైలు గోడల మధ్యలో ఉంటే, పొత్తు వ్యూహాలు వేసే ఛాన్స్ ఉండదని, అందువల్ల వాళ్ళ పొత్తు వచ్చే ఎన్నికలలో విఫలం అవుతుందనే లక్ష్యం తోనే ప్రభుత్వం చంద్రబాబు ని జైలు లోకి నెట్టారని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఇకపోతే తెలుగు దేశం పార్టీ ముఖ్య నేత దేవినేని ఉమా ( Devineni Uma )నేడు చంద్ర బాబు నాయుడు ని రాజముండ్రి జైలు లో కలిసాడు.
అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి, చంద్రబాబు నాయుడు ని వయస్సున్న పెద్ద మనిషి అని కూడా చూడకుండా, రాజముండ్రి సెంట్రల్ జైలు సిబ్బందులు సైకో చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు.
మూడు సార్లు ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తిని అలా చూడడం మనసుకు ఎంతో బాధ కలిగించింది అంటూ ఆరోపించారు.
"""/" /
ఇంకా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు గారిని రాత్రులు నిద్ర పోనివ్వకుండా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, విజిల్స్ తో శబ్దాలు చెయ్యడమే కాకుండా, ఆయన ఉంటున్న సెల్ ఊచలపై లాఠీతో కొట్టడం వంటివి చేస్తున్నారని.
అందువల్ల టక్కుమని నిద్రలో నుండి పైకి లేచి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సార్లు ఉలిక్కిపడ్డారని, అది సీసీటీవీ కెమెరా లో చూసి రాక్షస ఆనందం పొందుతున్నారని చెప్పుకొచ్చారు.
ఇదంతా విన్న తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఆవేశం తో ఊగిపోతున్నారు.ఇంకో ఆరు నెలలు దాటితే వైసీపీ పార్టీ నాయకులందరికీ ఇదే పరిస్థితి వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్టార్ హీరోయిన్ శ్రీదేవి మరణానికి అసలు కారణమిదేనా.. మరణం వెనుక ఇంత జరిగిందా?