Rape Attempt: డాక్టర్ ప్రైవేట్ పార్ట్ కోసేసిన నర్సు..

బీహార్( Bihar ) లోని సమస్తిపూర్‌లో బుధవారం రాత్రి ఓ వైద్యుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సుపై అత్యాచారానికి యత్నించగా, దానికి రక్షణగా నర్సు ఆపరేషన్‌లో ఉపయోగించిన బ్లేడ్‌తో డాక్టర్ ప్రైవేట్ పార్ట్‌ను కోసింది.

దీని తరువాత, నర్సు ఎలాగో ఆసుపత్రి నుండి తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించి.

ఆమె ప్రాణాలను కాపాడుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన డాక్టర్‌తో పాటు అతని ఇద్దరు సహచరులను అదుపులోకి తీసుకుని, నిందితులని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా, ఈ ఘటనను సదరు ఎస్‌డీపీఓ సంజయ్‌కుమార్‌ పాండే గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

నిందితుడు డాక్టర్‌ను బెగుసరాయ్ జిల్లా తెఘ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని దివంగత రాంభజన్ సింగ్ కుమారుడు సంజయ్ కుమార్‌( Sanjay Kumar )గా గుర్తించారు.

అలాగే వైద్యుడి స్నేహితుడిని వైశాలి జిల్లాలోని బలిగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిఘా ఫతేపూర్ నివాసి భఖన్ ప్రసాద్ గుప్తా కుమారుడు సునీల్ కుమార్ గుప్తా, బజిత్‌పూర్ సర్సౌనాలో నివసిస్తున్న రాజేశ్వర్ సింగ్ కుమారుడు అవధేష్ కుమార్‌గా గుర్తించారు.

"""/" / సెప్టెంబర్ 11వ తేదీ రాత్రి డయల్ 112 ద్వారా ముశ్రీఘరారి పోలీస్ స్టేషన్ ఇంచార్జి ఫైజుల్ అన్సారీకి సమాచారం అందిందని ఎస్‌డిపిఓ తెలిపారు.

ఈ మేరకు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.విషయం తీవ్రతను గమనించిన పోలీసు సూపరింటెండెంట్ వినయ్ తివారీ ముశ్రీఘరారి పోలీస్ స్టేషన్ చీఫ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

బృందం బాధిత నర్సు వద్దకు చేరుకోగా, ఆమె జానర్ పొలంలో దాక్కున్నట్లు గుర్తించారు.

ఇక విచారణలో, బాధితురాలు తాను గత 15 నెలలుగా ఆర్‌బిఎస్ హెల్త్ కేర్ సెంటర్ లో పనిచేస్తున్నానని చెప్పింది.

బుధవారం రాత్రి ఆస్పత్రిలో పేషెంట్ ఎవరూ లేరు.ఆ రోజు డాక్టర్, మరో ఇద్దరు వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు.

ఆ తర్వాత తనని పిలిచి అందరూ కలిసి ఒక అసహ్యకరమైన సంఘటనకు ప్రయత్నించారు.

రక్షణగా తన చేతిలోని సర్జరీలో ఉపయోగించే బ్లేడ్‌తో వైద్యుడి ప్రైవేట్‌ భాగాలపై దాడి చేసానని తెలిపింది.

ఈ దాడి తర్వాత ముగ్గురూ ఆమెని విడిచిపెట్టారని., గేటు తాళం తెరిచి పారిపోయినని తెలిపింది.

అదే సమయంలో డాక్టర్ స్నేహితుడు కూడా తనిని వెంబడించాడనని, అయితే తను పొలంలో దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చింది.

"""/" / బాధితుడి నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఆర్‌బిఎస్ హెల్త్ కేర్ సెంటర్‌కు చేరుకుని అరలీటర్ మద్యం, ఒక కారు, బాధితురాలు ఉపయోగించిన బ్లేడ్, లుంగీ, బెడ్‌సీట్, ప్యాంట్ (ముగ్గురిపై రక్తం ఉంది) స్వాధీనం చేసుకున్నట్లు SDPO తెలిపారు.

మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.గాయపడిన వైద్యుడికి చికిత్స అందించారు.

అరెస్టు( Arrest ) అనంతరం ముగ్గురూ నేరం అంగీకరించారు.పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.

అల్లు అర్జున్ భార్య ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. వామ్మో అంత సంపదించారా?