తెలంగాణ పాదయాత్రల సందడి.. తెరమీదకు మరో కీలక వ్యక్తి!
TeluguStop.com
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పడు అనుకోని ఘటనలు జరుగుతున్నాయి.ఒకదాని వెనక ప్రతి పార్టీల్లోనూ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
మొన్నటి వరకు టీఆర్ ఎస్‌లో ఈటల రాజేందర్ సంచలనంగా మారి చివరకు బీజేపీలో చేరారు.
ఇక బీజేపీలో ఈటల రాకతో అనేక అనుమానాలు తెరమీదకు వచ్చాయి.బండి సంజయ్ ఆయనకు సపోర్టు ఉండరేమో అనుకున్న నేపథ్యంలోనే కాంగ్రెస్‌కు రేవంత్‌రెడ్డని అధ్యక్షుడిగా చేయడంతో ప్రజల దృష్టి కాంగ్రెస్ మీదకు మళ్లింది.
ఇక అందులో అయితే భగభగలు, రాజీనామాలతో అట్టుడికిపోయింది.ఇదే అనుకుంటే నిన్న షర్మిలమ్మ కొత్త పార్టీతో రాజకీయాలు మరింత వేడెక్కాయి.
దీంతో ఇటు కాంగ్రెస్‌లో ఉన్న అసంతృప్త నేతలు ఆమెవైపు చూసే అవకాశం కూడా ఉంది.
ఇక ఇలాంటి పోటీ రాజకీయాల నడుమ కొత్త బాస్‌లు, ఇది వరకే పార్టీలకు బాస్‌లుగా కొనసాగుతున్న వారు తమ ఉనికిని ప్రత్యేకతను చాటుకునేందుకు పాదయాత్రల అస్త్రాన్ని తెరమీదకు తెస్తున్నారు.
ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు.
ఇక రేవంత్ కూడా త్వరలోనే పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. """/"/
నేనేం తక్కువ కాదంటూ షర్మిల కూడా అక్టోబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానంటూ ప్రకటించింది.
అయితే వీరంతా ఆయా పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నారు.కానీ ఏ పార్టీ లేకపోయినా ప్రజల్లో ఆదరణ ఉన్న ఓ నేత ఇప్పుడు పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఆయనే తీన్మార్ మల్లన్న.ఎమ్మెల్సీ ఎన్నికలతో ఒక్కసారిగా అన్ని పార్టీల దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈయన ఇప్పుడు మళ్లీ పాదయాత్ర చేస్తానంటూ ప్రకటించాడు.
ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కొంత మేరకు పాదయాత్ర చేసిన మల్లన్న.ఇప్పుడు కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు.
మొత్తానికి ఒకరిని మించి ఒకరు పాదయాత్రల జెండా ఎత్తుకుంటున్నారు.చూడాలి మరి ఎవరు పైచేయి సాధిస్తారో.
తొలిసారి నెగిటివ్ రోల్ లో ప్రభాస్.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఆ రోల్ లో కనిపిస్తారా?