కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ సర్కారే…ప్రధాని రాహుల్ గాంధీయే: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా:రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం,జూన్ లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని రాష్ట్ర నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

మంగళవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో మునగాల, నడిగూడెం,మోతె మండలాల స్థాయి కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని,ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామన్నారు.

పేద ప్రజలకు అందాల్సిన పిడిఎఫ్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేస్తామని తెలిపారు.నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి విజయానికి పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని,ఈనెల 18వ తేదీన జరిగే ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఈ మూడు మండలాల నుండి కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి,స్థానిక ప్రజా ప్రతినిధులు,మూడు మండలాల పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అక్కడ ఫ్రీ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభించిన ఉపాసన.. ఎంతో సంతోషంగా ఉందంటూ?