అయోధ్య తీర్పు జాతీయ పార్టీల మౌనం, కారణం ఇదేనా?

అయోధ్యలోని వివాదాస్పద భూ విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ముఖ్యులు స్పందించారు.

కాని ఇప్పటి వరకు బీజేపీ మరియు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు మాత్రం మాట్లాడటం లేదు.

ఎందుకంటే ఇప్పటి వరకు ఆ పార్టీలు రెండు కూడా తీర్పు విషయంలో ఎలాంటి ఒక నిర్ణయానికి రాలేదు.

ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ తమ పార్టీ అధికార ప్రతినిధులకు అసలు టీవీ కార్యక్రమాల చర్చలకు వెళ్లవద్దంటూ ఆదేశించింది.

అయోధ్య తీర్పు విషయమై మాట్లాడవద్దంటూ సూచించింది.పార్టీ అధినాయకత్వం ఈ విషయమై చర్చించి ఎలా స్పందించాలనే విషయంపై ఒక నిర్ణయం తీసుకోనుంది.

బీజేపీ కూడా తమ నాయకులను టీవీ చర్చ కార్యక్రమాల్లో పాల్గొనవద్దంటూ సూచించింది.టీవీ కార్యక్రమాల్లో ఈ రెండు పార్టీ నాయకులు లేకపోవడంతో వెలవెల బోతున్నాయి.

ఇక ఈ రెండు పార్టీలు కూడా వెంటనే స్పందించకుండా ఉండటం మంచి నిర్ణయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఈ రెండు పార్టీల కార్యకర్తలు ఉంటారు.ఈ తీర్పుపై ఎలా స్పందించినా కూడా ఆ పార్టీల కార్యకర్తలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.

అందుకే స్పందించకుండా ఉండటం ఉత్తమం అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

పూరి జగన్నాధ్ హీరో దొరికాడా..? ఇంతకీ ఎవరా హీరో..?