పార్టీ పేరు, జెండాను ప్రజలే నిర్ణయిస్తారుః గులాంనబీ ఆజాద్
TeluguStop.com
కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్.సొంత పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
దీనిలో భాగంగా తొలిసారి జమ్మూకశ్మీర్ లో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన హాజరైయ్యారు.
సైనిక్ ఫామ్స్ వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీలో 20 వేల మందికి పైగా మద్ధతుదారులు పాల్గొన్నారు.
అయితే, ఆజాద్ ఇంకా పార్టీ పేరు నిర్ణయించలేదని తెలిపారు.పార్టీ పేరుతో పాటు జెండాను జమ్మూకశ్మీర్ ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.
అందరికీ అర్థమయ్యే విధంగా తన పార్టీకి హిందుస్థానీ పేరు పెడతామని ఆజాద్ పేర్కొన్నారు.
అదేవిధంగా జమ్మూకశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా పునరుద్ధరణ, ఉద్యోగ హక్కులపై తమ పార్టీ దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు.
అమెరికాలో టిక్ టాక్ షట్ డౌన్..