చలివేంద్రాలను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని 25వ వార్డు ముత్యాలమ్మ గుడి సమీపంలో సూర్యాపేట పురపాలక సంఘం ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాన్ని మంగళవారం స్థానిక కౌన్సిలర్ ఆకుల కవితతో కలిసి సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిలో రానున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని సూర్యాపేట పట్టణ ప్రజల దాహాన్ని తీర్చుటకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆదేశాలతో మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిది చౌరస్తాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

సూర్యాపేట పట్టణ ప్రజలు ఈ కేంద్రాలను ఉపయోగించుకొని ఎండలకు ఇబ్బంది పడకుండా తమ యొక్క దాహాన్ని తీర్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకుల లవకుశ,జానకి రాములు, పిడమర్తి మధు,ఎర్ర వెంకన్న,సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్,మెప్మా పీడీ అధికారి రమేష్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ కమిటీ సభ్యులు,వార్డు డెవలప్మెంట్ కమిటీ సభ్యులు,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

స్టార్ హీరో బాలయ్య ఫిట్ నెస్ సీక్రెట్ ఇదేనా.. ఆ ఫుడ్ మాత్రమే ఇష్టంగా తింటారా?