వెదురుతో అద్భుతాలు చేస్తున్న యువకుడి టాలెంట్ కి నెటిజన్స్ ఫిదా..!

సోషల్ మీడియా పాపులర్ అయ్యాక ప్రతి ఒక్కరూ తమలోని ప్రతిభను( Talent ) నలుగురికి చూపించి అందరి ప్రశంసలు పొందుతున్నారు.

సాధారణంగా ప్రతి మనిషిలో ఏదో ఓ ప్రత్యేకత ఉంటుంది.ఎవరైనా కూడా కాస్త సాధన చేస్తే.

తమలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది.ఈ కోవలోనే 26 ఏళ్ల కుల్దీప్ సీల్( Kuldeep Seal ) వెదురు కర్రలతో ( Bamboo ) వెదురు బొమ్మలను చాలా ప్రత్యేకంగా తయారు చేస్తున్నాడు.

రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి అద్భుతమైన బొమ్మలను తయారు చేశాడు.

కుల్దీప్ సీల్ అస్సాంలోని బోర్ మఖి బాహాకు చెందినవాడు.ఇతని తండ్రి నారాయణ సీల్ ఓజా పాలి ప్లేయర్, తల్లి బిజయ సీల్ ఓ గృహిణి.

పగలంతా కుల్దీప్ సీల్ స్పెషల్ గా కేశాలంకరణ చేసేవాడు.అంటే పగటిపూట బార్బర్ గా( Barber ) పనిచేస్తూ ఖాళీ సమయాలలో వెదురుతో అద్భుతమైన బొమ్మలు తయారు చేయడం ప్రారంభించాడు.

"""/" / కుల్దీప్ సీల్ ఏకంగా వెదురుతో ఐదు అడుగుల తాజ్ మహల్ ను ( Bamboo Taj Mahal ) అద్భుతంగా తయారుచేశాడు.

పగలు పనిచేసుకోవడం, రాత్రి ఈ క్లిష్టమైన కళాఖండానికి కుల్దీప్ సీల్ జీవం పోసేవాడు.

తాజ్ మహల్ తయారీ వెనుక ఎన్నో నిద్రలేని రాత్రుల శ్రమ దాగి ఉంది.

ఈ తాజ్ మహల్ ను 1-1.5 లక్షల రూపాయలకు విక్రయించడానికి నిర్ణయం తీసుకున్నాడు.

"""/" / కుల్దీప్ సీల్ తయారు చేసే వెదురు బొమ్మలను( Bamboo Toys ) చూస్తే అతని నైపుణ్యం పట్ల అతని వినయం అభిరుచి తెలుస్తుంది.

ఇతను తయారుచేసిన వెదురు బొమ్మలకు ఆ ప్రాంతంలో చాలా డిమాండ్ పెరిగింది.ఇతను తయారుచేసిన వెదురు బొమ్మలను కొనేందుకు దూరప్రాంతాల నుండి తరలి వస్తున్నారు.

ఇతను తయారు చేసిన బొమ్మలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల చూసే వారంతా ఇతని నైపుణ్యానికి ఫిదా అవుతున్నారు.

ఏంటి జూనియర్ ఎన్టీఆర్ చేజేతులా ఇంత పెద్ద నష్టం తనకు తానే చేసుకున్నారా ?