శృతిహాసన్ సినీ కెరీయర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలివే.. ప్రభాస్ అల్లు అర్జున్ సినిమాలు కూడా?
TeluguStop.com
లెజెండరీ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి వచ్చిన శృతిహాసన్ తన టాలెంట్ తో ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు సంపాదించుకున్నారు.
కెరియర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న శృతిహాసన్ అనంతరం ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
అయితే తన ప్రేమ వ్యవహారం కారణంగా కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన శృతిహాసన్ తిరిగి రవితేజ సరసన క్రాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కావడంతో శృతిహాసన్ పలువరస అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోని ఈమె ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి పాన్ ఇండియా చిత్రం సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
అదేవిధంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నటువంటి సినిమాలో కూడా శృతిహాసన్ సందడి చేస్తున్నారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా కెరియర్లో ముందుకు సాగుతున్న శృతిహాసన్ తన కెరియర్లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశారు.
మరి ఈమె రిజెక్ట్ చేసిన సినిమాలలో ప్రభాస్ అల్లు అర్జున్ మహేష్ బాబు వంటి హీరోల సినిమాలు ఉండడం విశేషం.
మరి శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటి అనే విషయాన్నికి వస్తే. """/"/
మహేష్ బాబు కాజల్ అగర్వాల్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మెన్ సినిమాలో నటించే అవకాశం ముందుగా శృతిహాసన్ కి వచ్చింది.
అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం కాజల్ అందుకున్నారు.
అదేవిధంగా నాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా అవకాశం ముందుగా శృతిహాసన్ కి వచ్చింది.
రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ, అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం, ప్రభాస్ రెబల్ వంటి సినిమాలలో నటించే అవకాశం శృతిహాసన్ కి వచ్చిన ఈమె కొన్ని కారణాలవల్ల ఈ సినిమాలను రిజెక్ట్ చేశారు.
చరణ్ మాటలు నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కు పండగే.. అసలేం జరిగిందంటే?