కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం

కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.అర్థరాత్రి సమయంలో కరీంనగర్ శివారు ప్రాంతంలో ఎలుగుబంటి సంచరించిందని సమాచారం.

శ్రీపురం కాలనీతో పాటు రేకుర్తిలో కనిపించిందని స్థానికులు చెబుతున్నారు.దీంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది ఎలుగు కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.కాగా ఎలుగుబంటి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

ఈ ఆయిల్ ను వాడితే పురుషులకు బట్టతల భయమే అక్కర్లేదు!