ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్.. దీని ధర ఎన్ని లక్షలు తెలిస్తే..??

బర్గర్లు చాలా రుచిగా ఉంటాయి.ఇవి తక్కువ ఖర్చులోనే దొరుకుతాయి కానీ కొంతమంది మాత్రం ఖరీదైన పదార్థాలతో మిళితం చేసి వాటిని ఎక్కువ ధరకు అమ్మేస్తుంటారు.

కానీ రూ.లక్షల్లో పలికే బర్గర్ గురించి విన్నారా? ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కింది.

ఈ బర్గర్ ఖరీదైన ధరకే కాకుండా, దాని అద్భుతమైన రుచి, అరుదైన పదార్థాల వల్ల కూడా ప్రత్యేకత సంతరించుకుంది.

"""/" / 'ది ఫ్లూర్ డి లైస్( The Fleur De Lys )' అని పేరు పెట్టారు.

చాలా ధర పలకడానికి ఈ బర్గర్ లో ఏముంది? అని ప్రశ్నిస్తే ఇందులో రుచికరమైన వాగ్యూ బీఫ్‌తో పాటు, సున్నితమైన కావ్యార్, రుచికరమైన కింగ్ క్రాబ్ పొరలు ఉంటాయి.

దీని బన్నులు, ఉల్లిపాయల రింగ్స్ కూడా సాధారణమైనవి కాదు.అవి డాం పెరిగ్నాన్ షాంపైన్ తో తయారవుతాయి.

ఈ బర్గర్ కి ప్రత్యేక గుర్తింపునిచ్చేది ఏమిటంటే దానిపై అలంకరించిన బంగారు రేకులు.

"""/" / ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ బర్గర్( Burger ) ధర ఎంతో తెలుసా? 5,000 యూరోలు (4.

5 లక్షల రూపాయలు!).గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్( Guinness Book Of World Records ) ప్రకారం, ఈ బర్గర్ అద్భుతమైన రుచితో అందరినీ ఆకట్టుకుంటుంది.

ఇందులో పంచ రుచులైన పులుపు, చేదు, ఉప్పు, తీపి, ఉమామి ఉండటం వల్ల ఈ బర్గర్ చాలా రుచిగా ఉంటుంది.

అయితే, ఈ బర్గర్ ఖరీదు చాలా మందికి నచ్చలేదు.ప్రపంచంలో ఆకలి, పేదరికం వంటి తీవ్రమైన సామాజిక-ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు, ఇలాంటి ఖరీదైన వస్తువు ఎందుకు అవసరం అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ బర్గర్ ధర గురించి చాలా విమర్శలు వస్తున్నాయి.కొంతమంది దాని ధరను నమ్మలేకపోతున్నారు, మరికొందరు ప్రపంచ ఆకలి గురించి ఆలోచిస్తున్నారు.

ఈ అద్భుతమైన బర్గర్ ను చెఫ్ రాబర్ట్ జాన్ డి వెన్ తయారు చేశారు.

దీన్ని ఒక మంచి పనిగా భావిస్తారు.కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ఈ బర్గర్ ఆలోచన పుట్టింది.

డి వెన్ లక్ష్యం కేవలం రికార్డు సృష్టించడమే కాదు, నెదర్లాండ్స్ లో ఉన్న పేదరికాన్ని వెలుగులోకి తీసుకురావడం కూడా.

"గోల్డెన్ బాయ్" మొదటి విక్రయం ద్వారా వచ్చిన ఆదాయంతో 1,000 ఆహార ప్యాకెట్లను అవసరమైన కుటుంబాలకు అందించారు.

ఎక్స్‌పెన్సివ్ బర్గర్ నుంచి వచ్చిన ఆదాయంతో చేసిన ఒక మంచి పని ఇది.

చిరంజీవి పెదనాన్న మా ఫ్యామిలీకి హెడ్ మాస్టర్… వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్!