వరదనీటిలో కొట్టుకుపోయిన వానరం.. అద్భుత రీతిలో కాపాడిన హనుమంతుడు..
TeluguStop.com
ఒక్కోసారి మన కళ్ల ముందే అద్భుతాలు జరుగుతాయి.ఊహించని రీతిలో కనిపించే దృశ్యాలను చూసి అంతా ఆశ్చర్యపోతుంటారు.
ఇక వరదల సమయంలో చాలా నష్టం జరుగుతుంది.కట్టుకున్న ఇళ్లు కొట్టుకుపోతాయి.
మన కళ్ల ముందే వరదల్లో అంతా నాశనం అయిపోతుంది.ఒక్కోసారి ప్రాణనష్టం కూడా జరుగుతుంది.
అది ఊహించని రీతిలో ఉంటుంది.ఆ సమయంలో వరద నీటిలో చాలా మంది కొట్టుకుపోతుంటారు.
అలాంటి వారిని కాపాడాలంటే అంత సులువైన పని కాదు.వారి ప్రాణాలను రక్షించాలని ప్రయత్నం చేసి ఇంకొందరు ప్రాణాలు కోల్పోతుంటారు.
వరద ప్రవాహంలో కొట్టుకుపోతు ప్రాణాలను కాపాడుకోవాలంటే అంత ఆషామాషీ విషయం కాదు.తాజాగా ఇలాంటి ఘటన యూపీలోని ఘజియాబాద్‌లో జరిగింది.
ఓ కోతిని హనుమంతుడు కాపాడాడు.ఈ ఆశ్చర్యకర ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
యూపీలోని ఘజియాబాద్ ప్రాంతంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి.అయితే ఇళ్లల్లోని వస్తువులు కూడా కొట్టుకుపోతున్నాయి.
మనుషులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.ఇలాంటి సమయంలో ఓ కోతి వరద నీటిలో కొట్టుకుపోయింది.
గంగానదిలో భారీగా వచ్చిన వరదలో అది కొట్టుకుపోతోంది.ఆ వరద ప్రవాహానికి ఎవరైనా దానిని కాపాడాలనుకున్నా అది సాధ్యమయ్యే పని కాదు.
అయితే ఆ కోతి ఆశ్చర్యకరంగా ప్రాణాలు దక్కించుకుంది.నది మధ్యలో ఉన్న హనుమంతుని విగ్రహమే ఆ కోతి ప్రాణాలను కాపాడింది.
నది మధ్యలో ఉన్న ఆ హనుమంతుని విగ్రహాన్ని పట్టుకుని గంటల సేపు ఆ కోతి అలాగే ఉండిపోయింది.
చివరికి స్థానికులు ఆ కోతి పరిస్థితిని చూసి పోలీసులకు సమాచారం అందించారు.వారు పడవపై వచ్చి, ఆ కోతిని కాపాడారు.
అయితే ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.ఆ కోతిని సాక్షాత్తూ హనుమంతుడే కాపాడాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
రాజమౌళి మహేష్ బాబు సినిమా మొదటి షెడ్యూల్ జరిగేది అక్కడేనా..?