అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
TeluguStop.com
నల్గొండ జిల్లా:నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రతీ ఎమ్మెల్యేకు నియోజకవర్గ కేంద్రంలో క్యాంపు కార్యాలయం ఉండటం సహజం.
దీనికోసం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఆనాటి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హయాంలో రూ.
కోటి ప్రజా ధనాన్ని వెచ్చించి ఓ రాజభవనానికి తేదీ:05-05-2017 న శంకుస్థాపన చేసి,నిర్మాణం చేపట్టారు.
మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పూర్తై నేటికీ ఐదేళ్లు దాటింది.అయినా ఇంత వరకు ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో మందుబాబులకు,అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.
ప్రజల సౌకర్యార్థం
కోటి రూపాయల ప్రజాధనంతో నిర్మించిన క్యాంప్ ఆఫీస్ దేనికి పనికి రాకుండా పోవడానికి తాజా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిర్లక్ష్యమే కారణమని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు.
ఇద్దరి మధ్య నెలకొన్న రాజకీయ వైరం కారణంగానే ప్రజాధనం వృథా అవుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఎవరైనా ఆ క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండి
ప్రజల సంక్షేమం కోసం పని చేయాల్సి ఉండగా ఆధిపత్య పోరులో ఇద్దరూ అడ్రెస్ లేకుండా పోవడంతో ప్రారంభోత్సవానికి నోచుకోక పడా పడిందని స్థానికులు వాపోతున్నారు.
స్థానిక ఎమ్మెల్యేను
కలవాలంటే హైదరాబాద్ వెళ్ళల్సిన పరిస్థితి ఏర్పడడంతో నియోజకవర్గ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి మునుగోడు ఎమ్మెల్యే వసతి గృహాన్ని ప్రారంభించి,ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ మునుగోడు మండల నాయకులు పందుల సురేష్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవడబ్బ సొమ్మని కోటి రూపాయలతో క్యాంపు కార్యాలయం నిర్మించి,పట్టించుకోకుండా
తిరుగుతున్నారని ప్రశ్నించారు.
ప్రజల కోసం నిర్మించిన ఎమ్మెల్యే వసతి గృహంలో పందులు సంచారం చేస్తుంటే నాయకులు ఏమి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
లాస్ ఏంజెల్స్ అగ్నిప్రమాదం .. బాధితులకు సిక్కు కమ్యూనిటీ ఆపన్నహస్తం