గత ప్రభుత్వ తప్పులు పునరావృతం కాకూడదు..: మంత్రి పొంగులేటి
TeluguStop.com
ఖమ్మం జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు.తమ ప్రభుత్వంలో అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
గత ప్రభుత్వ తప్పులు పునరావృతం కాకూడదన్న ఆయన ప్రభుత్వ ఆస్తులు దోచుకున్న వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు.
ఈనెల 28న మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.అలాగే సంక్రాంతికి మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు.
ధరణిపోర్టల్ లో జరిగిన తప్పులను ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు.దాంతో పాటుగా రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తామని వెల్లడించారు.
డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
హాలీవుడ్ డైరెక్టర్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. బాక్సాఫీస్ షేక్ కానుందా?