బాలికను గర్భవతిని చేసిన తాత వరుసైన కామాంధుడు.. !

సమాజంలో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే మనుషులుగా పుట్టినందుకు సిగ్గుపడేలా కొందరు ప్రవర్తిస్తున్నారు.ప్రస్తుతం మనుషులకు వావి వరసలు, వయస్సు బేధాలు అంటూ ఏవీ లేవు.

కోరికతో చచ్చిపోతూ ఎంతకైనా తెగిస్తున్నారు.నమ్మకం మాటున వంచిస్తున్నారు.

ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వీళ్ల జీవితాలను నాశనం చేస్తున్నారు.

ఇకపోతే తాత వరుస అయ్యే ఓ కామాంధుడి లీల వెలుగులోకి వచ్చింది.ఆ వివరాలు చూస్తే.

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన గుంజ వెంకన్న(45), అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన వరుసకు మనుమరాలు అయ్యే మైనర్ బాలికపై కోరికను పెంచుకుని ఒంటరిగా ఉన్న సమయంలో మాయమాటలు చెప్పి లొంగ దీసుకున్నాడట.

కాగా ఆ బాలిక తండ్రి చనిపోవడంతో, కుటుంబ పోషణ నిమిత్తం ఆ తల్లి రోజువారీ కూలికి వెళ్లిన సమయంలో ఈ కామాంధుడు రెచ్చిపోతున్నాడని, దీని ఫలితంగా బాలిక గర్భవతి అన్న విషయం బయటకు వచ్చిందట.

ఇక ఈ మ్యాటర్ పోలీసుల వరకు వెళ్ళడంతో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారట.

గేమ్ చేంజర్ ప్లాప్ అవ్వడానికి శంకర్, రామ్ చరణ్ ఇద్దరిలో కారణం ఎవరు..?