మంత్రి చెక్కు ఇచ్చారు అకౌంట్లో డబ్బులు జమ కాలేదు…!
TeluguStop.com
యాదాద్రి భువనగిరి జిల్లా: మహిళా శక్తి నేటి సమాజానికి చాటాలని నాటి నుండి నేటి వరకు ప్రభుత్వాలు పట్టణ మరియు గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థిక స్వయం సహాయకంగా ఎదగడం కొరకు మహిళా సంఘాల ద్వారా రుణ ప్రోత్సహకలు అందిస్తూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని 416 మహిళా సంఘాలకు 2018-19 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.
20 లక్షల వడ్డీని తిరిగి ఇచ్చారు.అదే విధంగా 2019-20,2020-21కి గాను 526 మహిళా సంఘాలకు 1 కోటి 33 లక్షల 89 వేల రూపాయల చెక్కును 2023 జూన్ 15 న ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత,పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా మహిళా సంఘాలకు అందజేశారు.
కానీ,నేటి వరకు ఒక్క సంఘంలో కూడా డబ్బులు జమ కాక పోవడంతో మహిళా సంఘాల సభ్యులు
అవేదన వ్యక్తం చేశారు.
ఇదే విషయమై ఏపీఎం అంజయ్యను వివరణ కోరగా చెక్కు ఇచ్చిన మాట నిజమేనని,అతి త్వరలో మహిళా సంఘాలకు డబ్బులు అకౌంట్లో జమ అవుతాయని,2021 నుండి 2023 వరకు మహిళా సంఘాల వడ్డీలు రావాల్సి ఉందని చెప్పడం గమనార్హం.
సూర్య సినిమాకు భారీ షాక్.. ఆ పిటిషన్ తో సినిమా రిలీజ్ కు ఇబ్బందులు తప్పవా?