సముద్ర గర్భంలోని ఖనిజ సంపదను ఇలా కూడా వెలికితీయవచ్చు..
TeluguStop.com
సముద్రంలో బంగారం, వజ్రాలు, లోహాలు( Gold, Diamonds, Metals ) లాంటి ఎంతో ఖనిజ సంపద ఉంటుంది.
సముద్రం అడుగు భాగంలో ఇవి ఉంటాయి.సముద్ర గర్భంలోని ఖనిజ సంపద.
లోహాలను బయటకు తీసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఖనిజాలు( Minerals ) భూగర్భంలో తక్కువగా లభిస్తాయి.
అందుకే వాటి కోసం సముద్ర గర్భంలో వెతుకుతూ ఉంటారు.ఇందుకోసం అనేక ప్రయోగాలు చేపడుతూ ఉంటారు.
అత్యంత లోతుగా ఉండే సముద్ర గర్భంలోని ఖనిజాలను ఎలా బయటకు తీస్తారనేది తెలసుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు.
ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం.సముద్రాల్లోని ఖనిజ సంపదను వెలికి తీసేందుకు అనేక పద్దతులు ఉన్నాయి.
వాటిల్లో ఒకటి డీప్ సీ మైనింగ్.ఇటీవల దీని గురించి బాగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ పద్దతి ద్వారా సల్‌ఫ్లైడ్ నుంచి నిక్షేపాలను తవ్వడం, రాతి నుంచి కోబల్ట్ క్రస్ట్‌ను ( Cobalt Crust )తొలగించడం వంటి పద్దతుల ద్వారా ఖనిజాలు, లోహాలను బయటకు తీస్తారు.
ఈ మైనింగ్ ద్వారా కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి లోహాలు బయటకు తీయవచ్చు.
ఇక వాక్యూమ్ క్లీనర్ తరహాలో భారీ పంపులను సముద్రం లోపలికి పంపించడం, అలాగే రోబోలకు పంపించడం, సముద్రం లోపలోకి వెళ్లి తవ్వగలిగే భారీ యంత్రాలను తయారుచేయడం వల్ల ఖనిజాలను బయటకు తీస్తున్నారు.
"""/" /
ఈ సముద్రంలోని తవ్వకాలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దీని వల్ల పర్యావరణానికి హాని కలిగి పెను ముప్పు ఏర్పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
మైనింగ్( Mining ) వల్ల వచ్చే శబ్ధాలు, ప్రకంపనలు వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయని అంటున్నారు.
అలాగే సముద్రంలో మైనింగ్ వల్ల మత్స్య సంపద కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు.
సముద్రంలో జీవించే ఇతర జీవుల సంచారానికి కూడా సమస్యలు వస్తాయని ఆందోళనలు చేస్తున్నారు.
తెలుగువారని అవమానించలేదన్న కస్తూరి.. ఆమె వివరణతో తెలుగు వాళ్లు కూల్ అవుతారా?