నేరేడుచర్లలో దొంగల బీభత్సం…!
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని పాత నేరేడుచర్లలో దొంగకు భీభత్సం సృష్టించారు.నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.
నూకల జానకమ్మ శనివారం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్ళింది.తిరిగి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి,బీరువా తలుపులు తెరిచి ఉన్నాయని, ఇంట్లో ఉన్న రూ.
50 వేల నగదు,2 తులాల బంగారం,8 తులాల వెండి అపహరణకు గురైనట్లు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
“క” సినిమాతో కిరణ్ అబ్బవరం ఖాతాలో సంచలన రికార్డ్.. రేంజ్ పెరిగిందిగా!