సెప్టెంబర్ 2న జరగాల్సిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ వాయిదా..!

తెలంగాణలో సెప్టెంబర్ 2వ తేదీన జరగాల్సి ఉన్న ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ వాయిదా పడిందని తెలుస్తోంది.

సెప్టెంబర్ 2న దివంగత నేత వైఎస్ఆర్ జయంతితో పాటు పలు కార్యక్రమాలు ఉండటంతో భేటి వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అదేవిధంగా 4వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో స్క్రీనింగ్ కమిటీ భేటీ జరుగుతుందని తెలిపాయి.

కాగా తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీపీసీసీ స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే.

ఫౌజీ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి ? అది ఏ ఇయర్ లో జరుగుతుంది..?