రెస్టారెంట్ లో సడెన్ గా పడిపోయిన వ్యక్తి.. అక్కడి వారు ఎలా కాపాడారంటే
TeluguStop.com
ఇవాళ రేపు పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం.మన కండ్లు ముందు ఎవరైనా పడిపోతే కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోతుంటాం.
ఇంకెవరికైనా ప్రమాదాలు జరిగినా సరే అస్సలు చూడకుండా అతన్ని కనీసం ఆస్పత్రికి కూడా తీసుకెళ్లకుండా నాకేంటి అన్నట్టు వెళ్లిపోవడం చాలా కామన్ అయిపోయింది.
అయితే ఇప్పుడు మాత్రం ఇందుకు భిన్నంగా ఓ టేబుల్ దగ్గర ఫుడ్ తింటూ పడిపోయిన వ్యక్తిని కొందరు ఎలా కాపాడారో మనం చూడొచ్చు.
దీన్ని చూసిన తర్వాత మీ ఒపీనియన్ పూర్తిగా మారిపోతుందేమో.ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఓ రెస్టారెంట్‌లో కొందరు ఫుడ్ తినేందుకు వచ్చారు.
ఇందులో ఓ టేబుల్ దగ్గర తాను ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ను తింటున్న వ్యక్తి అనుకోకుండా సడెన్ గా టేబుల్ మీద పడిపోతాడు.
దీంతో అది చూసిన వెయిటర్స్ టెన్షన్ పడిపోతారు.ఏం చేయాలో అర్థం కాక అక్కడున్న మిగతా కస్టమర్లు కూడా టెన్షన్ పడిపోతారు.
కాగా వెయిటర్స్, పోలీసులు వచ్చి హీమ్లిచ్ అనే విధానం ద్వారా ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడుతారు.
నిజానికి ఇలా ఆహారం తినే క్రమంలో గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఇలా పడిపోతారు.
ఈ సమయంలో కొన్ని పద్దతులు పాటిస్తే వారి ప్రాణాలు మనం కాపాడొచ్చు.ఈ ఘటన బ్రెజిల్‌లోని సావో పాలోలో జరిగినట్టు తెలుస్తోంది.
38 ఏళ్ల వ్యక్తి ఇలా నోట్లో ఏదో ఇరుక్కుని సడెన్ పడిపోయాడు.కాగా వెయిటర్స్ తో పాటు హైవే పెట్రోలింగ్ చేస్తున్న అధికారి అక్కడకు వచ్చి పైకి లేపుతూ అటు ఇటూ కదుపుతూ చివరకు అతన్ని కాపాడుతారు.
గొంతులో ఇరుక్కున్న ఆహారాన్ని తొలగించడానికి హీమ్లిచ్ అనే పద్ధతిని వాడుతుంటారు.దీని ద్వరా సమయానికి ఎవరి ప్రాణాలు అయినా కాపాడొచ్చని చెబుతున్నారు డాక్టర్లు, నిపుణులు.