కింగ్ కోబ్రాని కాపాడిన వ్యక్తి... వీడియో వైరల్

సాధారణంగా చాలామంది చిన్న పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరుగెత్తి భయంతో వణికిపోతారు.

ఇంకాస్త పెద్ద పాము కనబడితే ఎమన్నా ఉందా.వెన్నులో వణుకు పుట్టి ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి.

అయితే ఓ వ్యక్తి మాత్రం కళ్లముందు భారీ కింగ్ కోబ్రా ఉన్నా.కొంచెం కూడా భయపడలేదు.

అది చాలా ప్రమాదకరమే కాకుండా అత్యంత విషపూరితమైనదని తెలిసినా.భయపడకుండా దాన్ని రక్షించాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.వివరాల్లోకి వెళ్తే.

చేపల కోసం మత్స్యకారులు వలను ఏర్పాటు చేశారు.అయితే ఆ చేపల వలలోకి అనుకోకుండా ఓ కింగ్ కోబ్రా వచ్చి చిక్కుకుపోయింది.

ఆ వలలో నుండి బయటకు రాలేక నానా అవస్థలు పడుతుంది.ఇది గమనించిన ఓ వ్యక్తి ఏ మాత్రం భయపడకుండా దాని దగ్గరకు వెళ్లి వలను క‌త్తెర‌తో క‌త్తిరించి ఆ కోబ్రాను రక్షించాడు.

అనంతరం దాహంతో ఉన్న కోబ్రాకు వాట‌ర్ బాటిల్‌తో నీళ్లు తాగిస్తాడు.చివ‌ర‌గా, కోబ్రాను ర‌క్షించి సుర‌క్షిత ప్రాంతంలో వ‌దిలిపెడతాడు.

ఈ వీడియోను మిర్జా ఎండీ ఆరిఫ్ అనే యూ ట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేశారు.

ఈ వీడియోను ఒడిశాలో షూట్ చేశారు.ఈ వీడియో నెటిజ‌న్ల మ‌న‌సు గెలుచుకుంది.

ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన శ్రేణిలో కామెంట్స్ చేస్తున్నారు.మీ ధైర్యానికి జోహార్లు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.

రక్షించడమే కాకుండా నీరు తాగించిన మీ దయా హృదయానికి హ్యాట్సాఫ్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

కోట్లు ఇచ్చినా సరే ఈ నలుగురు హీరోలు చచ్చిన ఆ పని చేయలేదు !