గుండెనొప్పి డ్రామాతో ఫ్లైట్‌ను ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేయించిన ఘ‌నుడు..

కొంద‌రు అంతే.ఏదో చేయ‌బోయి ఇంకేదో చేసి వార్త‌ల్లో నిలుస్తుంటారు.

ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటిదేనండోయ్‌.ఇందులో అత‌ను చేసిన ప‌ని చూస్తే అంద‌రూ షాక్ అవ్వాల్సిందే.

ఎందుకంటే అత‌ను ఏకంగా ఓ హైడ్రామా ఆడి బీభ‌త్సం క్రియేట్ చేశాడు.ఈ వార్త గురించి వింటే అచ్చం దిగ్గ‌జ డైరెక్ట‌ర్ శంకర్ తీసిన స్నేహితుడు మూవీ గుర్తుకు వ‌స్తుంది.

ఎందుకంటే ఆ మూవీలో ఫ్లైట్ జ‌ర్నీ చేస్తున్న శ్రీరామ్ కు ఓ ఫోన్ కాల్ వ‌స్తే వెంట‌నే దిగేందుకు గుండె నొప్పి డ్రామా ఆడి స‌డెన్ గా ఫ్లైట్ ను ల్యాండ్ చేయిస్తాడు.

ఈ ఫార్ములాను ఇప్పుడు ఓ వ్య‌క్తి ఫాలో అయిపోయాడు.స్పెయిన్ దేశంలోని మొరాకో సిటీలోని కాసాబ్లాంకా ఎయిర్ పోర్టు నుంచి నిన్న ఓ ఫ్లైట్ బయలుదేరింది.

అయితే ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి ఇప్పుడు చాలామంది ఇత‌ర దేశాల‌కు వ‌ల‌స వెళ్తున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే ఆఫ్గ‌నిస్తాన్ కు చెందిన‌టువంటి ఓ బృందం మొరాకో నుంచి టర్కీకి వెళ్తున్న ఈ ఫ్లైట్ ను సెలెక్ట్ చేసుకుంది.

అయితే ఇలా వెల్తున్న ఆ బృందంలోని ఓ వ్య‌క్తి మ‌ధ్య‌లో త‌న‌కు అనారోగ్యంగా ఉందని చెప్పి ఎమ‌ర్జెన్సీ ల్యాండ్ చేయించాడు.

ఇంకేముంది ఆ ఫ్లైట్ ను ద‌గ్గ‌ర‌లోని ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ చేయించారు.

కాగా అత‌న్ని ఆస్ప‌త్రికి తీసుకెళ్తున్న క్ర‌మంలోనే 22 మంది విమానం నుంచి పారిపోయారు.

ప్లేన్ ను దిగి పారిపోయారు.ఇందులో కొంద‌రిని ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకోగా దాదాపు పది మంది ఎవ‌రికీ చిక్క‌కుండా ఎయిర్ పోర్టు నుంచి పారిపోయారు.

ఇంకో ట్విస్టు ఏంటంటే ఆ వ్య‌క్తికి ఎలాంటి అనారోగ్యం లేదంట‌.కాగా మొరాకో దేశం నుంచి స్పెయిన్ లో దిగిన వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

వారు అక్ర‌మంగా స్పెయిన్ లోకి ఎంట్రీ ఇచ్చార‌ని పోలీసులు చెబుతున్నారు.ఏదేమైనా కూడా ఇలా విమానాన్ని ఆపేసి మ‌రీ దిగ‌డం చూస్తుంటే నిజంగానే సినిమాలాగే ఉందంటూ అంద‌రూ కామెంట్లు పెట్టేస్తున్నారు.

ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని పవన్ కళ్యాణ్ కు ముందే తెలుసట.. అసలేమైందంటే?