ఆవును బైక్ ముందు చంటి పిల్ల లాగా కూర్చోబెట్టిన వ్యక్తి.. వీడియో చూస్తే..

సాధారణంగా ఆవులు, గేదెలు చాలా పెద్దగా ఉంటాయి.వాటిని తరలించడానికి ట్రాలీ ఆటోలు, లేదంటే డీసీఎంలు కావాలి కానీ మన ఇండియాలో మాత్రం వాటిని రవాణా చేయడానికి మామూలు బైక్ లనే ఉపయోగిస్తారు.

మనుషులంటే బైక్ మీద కూర్చోవచ్చు.ఆవులెలా కూర్చుంటాయని ఆలోచన మనకు రావచ్చు కానీ మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లు కొందరు ఈజీగా ఆవులను బైక్ పై కూర్చోబెట్టి తీసుకెళ్తుంటారు.

వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే కొన్ని వైరల్ అయ్యాయి.తాజాగా ఆ కోవకు చెందిన మరొక వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

"""/" / మొదటగా ఈ వీడియోను వైరల్ క్లిప్ (@Madan_Chikna) అనే ఖాతా ద్వారా X లో పోస్ట్ చేశారు.

తర్వాత ఎవరీ డే రీల్స్ డే అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంటు దీనిని పంచుకుంది.

12 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తన బైక్‌ ముందు సీటుపై ఆవును కూర్చోబెట్టినట్లు కనిపించింది.

అతనే వెనుక కూర్చుని ఉండగా.ఆవు ముందు కూర్చుని వెళుతూ చంటి పిల్ల లాగా చాలా కామ్ గా ఉంది.

ఆవు తన యజమానిని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు.తన యజమాని దానిని ఏ స్థితిలో కూర్చోబెట్టాడో అదే భంగిమలో అది మౌనంగా బైక్‌పై కూర్చుంది.

ఒకవేళ ఆ ఆవు కొంచెం కదిలినా బైక్ కిందపడి ఆవుకే కాకుండా మనిషికి కూడా తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉంది.

"""/" / నవంబర్ 11న షేర్ చేసిన ఈ క్లిప్‌కి 7 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

దీనిపై యూజర్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.ఆవును బైక్‌పై కూర్చోబెట్టడం ఎలా సాధ్యమైందో తనకి ఇప్పటికే అర్థం కావడం లేదని ఒక వ్యక్తి తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.

ఏది ఏదేమైనా ఇది చాలా పెద్ద రిస్కీ స్టంట్ అని చెప్పవచ్చు.ట్రాఫిక్ రూల్స్ ప్రకారం, అతడికి జరిమానా కూడా పడే ప్రమాదముంది.